గుజరాత్లో జియో-గూగుల్ జియోఫోన్ నెక్ట్స్ ఉత్పత్తి?!
గుజరాత్లో జియో-గూగుల్ జియోఫోన్ నెక్ట్స్ ఉత్పత్తి?! జియో-గూగుల్ సంయుక్త స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి గుజరాత్లో జరుగనున్నదని తెలుస్తున్నది. ఇందుకోసం ..

గాంధీనగర్: ప్రపంచంలోకెల్లా అతి చౌక స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి గుజరాత్లో జరుగనున్నదా? ఇది నిజమా అంటే.. పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. గత నెలలో జరిగిన రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ ప్రపంచంలోకెల్లా చౌక స్మార్ట్ ఫోన్.. జియోఫోన్ నెక్ట్స్‌ను విపణిలో ఆవిష్కరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. సెర్చింజన్ గూగుల్ సాయంతో రిలయన్స్ జియో ఈ స్మార్ట్ ఫోన్ అభివ్రుద్ధి చేస్తున్నది.
ఈ స్మార్ట్ ఫోన్‌ను గూగుల్- రిలయన్స్ తమ రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయనున్నదని గుజరాత్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రోజుల క్రితం గూగుల్ అధికారులు గుజరాత్లో పర్యటించారు. స్మార్ట్ ఫోన్ ఉత్పాదక ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం కోసం అన్వేషణ జరిపారని సమాచారం.
గుజరాత్‌లోని ధొలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌ను ఇటీవల గూగుల్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సందర్శించినట్లు తెలుస్తున్నది. ధోలెరా ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌లో ఇప్పటికే 80 శాతానికి పైగా మౌలిక వసతుల కల్పన ప్రక్రియ పూర్తయింది. ప్రపంచంలోని ఏ ఇన్వెస్టర్ అయినా ఈ రీజియన్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు.
కరోనా నేపథ్యంలో ఏ పెద్ద కంపెనీ గుజరాత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు. కోవిడ్-19 వల్లే ఈ ఏడాది వైబ్రంట్ గుజరాత్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుగలేదు. దీంతో గూగుల్‌ను తమ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు గుజరాత్ సర్కార్ ప్రయత్నిస్తున్నది. అయితే, గుజరాత్లో స్మార్ట్ ఫోన్ ప్లాంట్ కోసం గూగుల్ ఎంత పెట్టుబడి పెడుతుందన్న సంగతి వెల్లడి కాలేదు.
రిలయన్స్ జియోతో కలిసి ప్రపంచంలోనే అతి చౌక స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ సీసీవో సుందర్ పిచ్చాయ్ ప్రకటించారు. జియో రంగ ప్రవేశంతో లక్షల మంది మొబైల్ ఫోన్ యూజర్లకు తొలిసారి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది.
శరవేగంగా 100 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ అందుబాటులోకి తేవడానికి గూగుల్- జియో 5జీ రంగంలో భాగస్వాములయ్యాయి. దీంతో భారత్ డిజిటలైజ్ అవుతుందని సుందర్ పిచ్చాయ్ వెల్లడించారు.
గూగుల్-జియో సంయుక్తంగా అభివ్రుద్ధి చేసిన ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ సేల్స్.. సెప్టెంబర్ 10న గణేశ్ చతుర్థి నాటికి మొదలవుతాయి. సాధారణ పౌరుడి బడ్జెట్‌ను ద్రుష్టిలో పెట్టుకుని స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు.
జియో ఫోన్ నెక్ట్స్ ధర చాలా ఆమోదయోగ్యంగా ఉంటుందని ముకేశ్ అంబానీ తెలిపారు. 2జీ ఫోన్ వాడకం దారులందరినీ 5జీ వైపు మళ్లించడమే ముకేశ్ అంబానీ ప్రధాన లక్ష్యం
కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నా.. రిలయన్స్ డిజిటల్ ఫర్మ్ జియో ప్లాట్ ఫామ్స్ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు స్వీకరించింది. గతేడాది జూలైలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ 7.73 శాతం వాటాలను కొనుగోలుచేసింది. దీని విలువ రూ.33,737 కోట్లు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేకు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దవుతుందా!
Bellamkonda Sreenivas | ‘హైందవ’కు అదిరిపోయే బిజినెస్.. విడుదలకు ముందే రూ.32 కోట్లు,నిర్మాతలకు భారీ ఊరట!
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో ముదిరిన గొడవలు.. సుధీర్, ముకేష్ మధ్య మాటల యుద్ధం, తనను తాను కొట్టుకున్న నీతూ!
Donald Trump | ఓటమితో ట్రంప్‌కు ‘జ్ఞానోదయం’!.. అమెరికా వలస విధానంపై సంచలన వ్యాఖ్యలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం మరోసారి ఫోకస్.. ఈ నెల 24, 25 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

