అటు రిలయన్స్.. ఇటు టాటా
టైమ్స్ ప్రతిష్ఠాత్మకంగా ప్రకటిస్తున్న ప్రపంచంలోనే 100 అత్యంత ప్రభావశీల సంస్థల జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, సీరమ్ ఇన్స్టిట్యూట్లు చోటు దక్కించుకున్నాయి. ఈ ఏడాదికిగాను విడుదలైన ఈ లిస్టులో రిలయన్స్, టాటాలు..
- టైమ్స్ ప్రపంచ అత్యంత ప్రభావశీల సంస్థల్లో చోటు
- సీరమ్ ఇన్స్టిట్యూట్కూ స్థానం
న్యూఢిల్లీ, మే 30: టైమ్స్ ప్రతిష్ఠాత్మకంగా ప్రకటిస్తున్న ప్రపంచంలోనే 100 అత్యంత ప్రభావశీల సంస్థల జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, సీరమ్ ఇన్స్టిట్యూట్లు చోటు దక్కించుకున్నాయి. ఈ ఏడాదికిగాను విడుదలైన ఈ లిస్టులో రిలయన్స్, టాటాలు.. టైటాన్ కేటగిరీలో స్థానం పొందాయి. రిలయన్స్కు ఈ గౌరవం దక్కడం ఇది రెండోసారి. 2021 జాబితాలోనూ ఉన్నది. కాగా, ఈ సందర్భంగా రిలయన్స్ను ‘ఇండియా’స్ జాగర్నట్’గా టైమ్ అభివర్ణించడం గమనార్హం. అప్రతిహతంగా రిలయన్స్ అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నదని టైమ్స్ ప్రశంసించింది.
కరోనా వ్యాక్సిన్ను తయారు చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్కు పయనీర్ కేటగిరీలో చోటు లభించింది. ఈ లిస్టులో 100 కంపెనీలను మొత్తం 5 కేటగిరీల్లో విభజించగా.. లీడర్స్, డిస్ప్ట్రర్స్, ఇన్నోవేటర్స్ విభాగాలూ ఉన్నాయి. ఇక 58 ఏండ్ల క్రితం టెక్స్టైల్, పాలిస్టర్ కంపెనీగా మొదలైన రిలయన్స్.. నేడు 200 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా నిలిచిందని టైమ్ పేర్కొన్నది. ఎనర్జీ, రిటైల్, టెలికం, ఇతరత్రా రంగాల్లో విస్తరించిందని తెలిపింది. అలాగే టాటా గ్రూప్ 1868లో మొదలవగా.. ఉప్పు నుంచి ఉక్కు వరకు అన్నీ ఉత్పత్తి చేస్తున్నది విదితమే. టాటా సంస్థలన్నిటి మార్కెట్ విలువ 365 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇది పొరుగు దేశం పాకిస్తాన్ జీడీపీ కన్నా ఎక్కువ కావడం గమనార్హం. ఇదిలావుంటే ఇది టైమ్స్ నాల్గో జాబితా. ప్రభావం, కొత్తదనం, లక్ష్యం, విజయాల ప్రాతిపదికన ఆయా సంస్థలకు లిస్టులో చోటు దక్కింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

