ముంబై, ఆగస్టు 4: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రెండు నెలల కనిష్ఠానికి దిగజారింది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో మరో 7 పైసలు క్షీణించి 82.81 వద్దకు చేరింది. ఒకానొక దశలో 82.85 స్థాయికీ పతనమైంది. బుధ, గురువారాల్లోనూ రుపీ నష్టాలకే పరిమితమవగా.. దాన్ని కొనసాగిస్తూ మూడోరోజూ నిరాశే మిగిల్చింది. ఈ మూడు రోజుల్లో 59 పైసల విలువను కోల్పోవడం గమనార్హం.
ఈ వారం మొత్తంగా 64 పైసలు పడిపోయింది. డాలర్లకు ఎగుమతిదారుల నుంచి డిమాండ్ పెరగడం, గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు విజృంభిస్తుండటం.. రూపాయిని బలహీనపరుస్తున్నాయని ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. దేశం నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులూ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని చెప్తున్నారు.