రూ‘పాయే’.. 78.4 రికార్డు కనిష్ఠానికి కరెన్సీ
ముంబై, జూన్ 22: విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి అదేపనిగా నిధులు తరలించుకుపోతున్న నేపథ్యంలో రూపాయి మరో కుదుపునకు లోనయ్యింది. గత మూడు నాలుగు రోజులుగా డాలర్ మారకంలో రూపాయి విలువ 78 సమీపంలో స్థిరత్వాన్ని కనపర్చినప్పటికీ, బుధవారం ఒక్కసారిగా 19 పైసలు పడిపోయి కొత్త రికార్డు కనిష్ఠస్థాయి 78.32 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో 78.13 వద్ద ప్రారంభమై క్రమేపీ క్షీణించి 78.40 స్థాయికి దిగజారింది.
జూన్ 13న 78.28 వద్ద నమోదైన రికార్డు కనిష్ఠం నుంచి తాజాగా మరింతగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పటిష్ఠంగా ఉండటంతో రూపాయి బలహీనపడిందని, క్రూడ్ ధరలు కొంతమేర దిగిరావడం రూపాయి నష్టాల్ని పరిమితం చేశాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో అమెరికా కరెన్సీ బలాన్ని తెలిపే డాలర్ ఇండెక్స్ రికార్డు గరిష్ఠస్థాయి 104.50 సమీపంలో ట్రేడవుతున్నది.
అంతర్జాతీయ మార్కె ట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 4.5 శాతం మేర క్షీణించి 110 డాలర్ల దిగువకు తగ్గింది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా తగ్గడం సైతం రూపాయిపై ప్రభావం చూపించింది. సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా పతనమయ్యింది. ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు 27.22 బిలియన్ డాలర్లు వెనక్కు తీసుకున్నారు. గత తొమ్మిది నెలల్లో 32 బిలియన్ డాలర్ల స్టాక్స్‌ను విక్రయించారు.
డిసెంబర్‌కల్లా 81 స్థాయికి: బొఫా
డాలర్ నిధులు దేశం నుంచి తరలివెళుతున్నందున, కరెంట్ ఖాతా లోటు పెరుగుతున్నందున వచ్చే కొద్ది నెలల్లోనూ రూపాయి పతనం కొనసాగుతుందని ఆర్థిక వేత్తలు చెపుతున్నారు. క్రూడ్ ధర, డాలర్ విలువ బాగా తగ్గితే తప్ప రూపాయి క్షీణత ఆగదని డీబీఎస్ ఎకానమిస్ట్ రాధికారావు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ చివరికల్లా రూపాయి 81 స్థాయికి దిగజారుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బొఫా) సెక్యూరిటీస్ తాజాగా అంచనా వేసింది. ఈ సంస్థ గతంలో ప్రకటించిన 79 స్థాయి అంచనాల్ని దిగువముఖంగా సవరించింది.
అధిక ముడి పదార్థాల ధరలతో కార్పొరేట్ల లాభాల మార్జిన్లు తగ్గే రిస్క్ ఉందని, బలహీన వృద్ధి కారణంగా అమ్మకాలు తగ్గుతాయని, తుది ఉత్పత్తుల ధరల్ని పెంచే సామర్థ్యాన్ని కార్పొరేట్లు కోల్పోతాయని బొఫా అంచనా వేసింది. దీంతో ఈక్విటీ నిధులు తరలివెళతాయన్నది. అలాగే బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నందున కార్పొరేట్ల నిధుల సమీకరణ వ్యయం అధికమవుతుందని, వాటి బ్యాలెన్స్ షీట్లపై ఒత్తిడి పడుతుందని, ఈ అంశాలు ఈక్విటీ మార్కెట్లను, రూపాయిని ప్రభావితం చేస్తాయన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

