Hyderabad | హైదరాబాద్‌లో లగ్జరీ ఇండ్ల హవా.. సొంతింటి విషయంలో మారిన కొనుగోలుదారుల అభిరుచి
సొంతింటి విషయంలో కొనుగోలుదారుల అభిరుచి మారింది. ఏదో ఒక ఇంటిని కొనాలన్న ఆలోచన నుంచి నగరానికి కాస్త దూరమైనాసరే విశాలంగా, ప్రశాంత వాతావరణంలో నివాసం ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే ఆధునిక సాంకేతిక హంగులు, సౌకర్యాలు, భద్రత వంటి అంశాల్లోనూ రాజీ పడట్లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు నగర శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గేటెడ్ కమ్యూనిటీలకు ఆదరణ పెరుగుతున్నది.
- దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే భారీగా పెరుగుతున్న డిమాండ్
- ఈ జూలై-సెప్టెంబర్‌లో మార్కెట్లోకి 14,320 యూనిట్లు
- క్రమేణా పడిపోతున్న అందుబాటు ధరల్లోని గృహ నిర్మాణాలు
- తాజా నివేదికలో వెల్లడించిన అనరాక్ గ్రూప్
Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): సొంతింటి విషయంలో కొనుగోలుదారుల అభిరుచి మారింది. ఏదో ఒక ఇంటిని కొనాలన్న ఆలోచన నుంచి నగరానికి కాస్త దూరమైనాసరే విశాలంగా, ప్రశాంత వాతావరణంలో నివాసం ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే ఆధునిక సాంకేతిక హంగులు, సౌకర్యాలు, భద్రత వంటి అంశాల్లోనూ రాజీ పడట్లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు నగర శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గేటెడ్ కమ్యూనిటీలకు ఆదరణ పెరుగుతున్నది. రియల్టర్లూ వీటికే పెద్దపీట వేస్తున్నారు. దీంతో హైదరాబాద్ మహానగరం.. లగ్జరీ హౌజింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ సంస్థ విడుదల చేసిన తాజా త్రైమాసిక నివేదిక ఇదే చెప్తున్నది. హైదరాబాద్‌సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ తీరుతెన్నులపై ఈ రిపోర్టు వచ్చింది. ఇందులో లగ్జరీ ఇండ్లదే హవా అని తేలగా, హైదరాబాద్ ముందు వరుసలో నిలిచింది.
తగ్గిన చౌక గృహాలు
హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-ఎంఆర్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె నగరాలపై తాజా సర్వే జరిగింది. ఈ నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో కొత్తగా మార్కెట్లోకి 1,16,220 యూనిట్లు అందుబాటులోకి రాగా.. ఇందులో రూ.40 లక్షలు, అంతకంటే తక్కువ ధర కలిగినవి (సరసమైన ధరల గృహాలు) 20,920గా ఉన్నాయి. ఇది 18 శాతానికి సమానం. కరోనాకు ముందు గరిష్ఠంగా కొత్త ఇండ్లు నమోదైన 2018 జూలై-సెప్టెంబర్‌లో మొత్తం 52,120 యూనిట్లకు 21,900 సరసమైన ధరల గృహాలే. ఇది 42 శాతానికి సమానం. 2019 జూలై-సెప్టెంబర్‌లోనూ 41 శాతంగా ఉన్నట్టు గుర్తుచేసింది. అయితే 2021 ఇదే వ్యవధిలో 24 శాతంగా ఉన్నాయని, ఈ ఏడాది ఇంకా తగ్గాయన్నది. ఫలితంగా కొత్త ఇండ్లు ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో పెరిగినా.. వాటిలో సరసమైన ధరల గృహాల వాటా మాత్రం తగ్గినట్టు అనరాక్ చెప్పింది.
పెరిగిన లగ్జరీ యూనిట్లు
ఈ జూలై-సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చిన కొత్త ఇండ్లలో 31,180 లగ్జరీ యూనిట్లే. మొత్తం ఇండ్లలో ఇది 27 శాతానికి సమానం. 2018 జూలై-సెప్టెంబర్‌లో 4,590గా ఉన్నాయి. నాడు ఇది 9 శాతం. ఇక ఈసారి అత్యధికంగా హైదరాబాద్ నుంచే 14,340 ఉండటం గమనార్హం. 7,830 యూనిట్లతో రెండో స్థానంలో దేశ వాణిజ్య రాజధాని ముంబై నిలిచింది. కాగా, సర్వే సందర్భంగా వినియోగదారుల అభిప్రాయాలనూ అనరాక్ సేకరించింది. ఇందులో 16 శాతం మంది లగ్జరీ హౌజింగ్ ప్రాజెక్టులపట్ల ఆసక్తి కనబర్చారు. కోవిడ్‌కు ముందు వీరి సంఖ్య 9 శాతంగానే ఉండటం గమనించదగ్గ అంశం.
యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి తర్వాత లగ్జరీ హౌజింగ్‌కు డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకున్నది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో సొంత ఇండ్లను కొనుగోలు చేసేవారు విశాలమైన స్థలంతోపాటు అత్యాధునిక సౌకర్యాలు, మంచి లోకేషన్లకు ఇప్పుడు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రధానంగా రూ.1.5 కోట్ల నుంచి మొదలయ్యే ఇండ్లకు భారీ ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నది. గడిచిన ఐదేండ్లలో వీటికి ఆదరణ మూడింతలైంది. దీంతో డెవలపర్లూ వీటి నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నారు. ఇక లగ్జరీ ప్రాజెక్టులు హైదరాబాద్ కేంద్రంగా ఊహించని రీతిలో పెరిగాయి. నిజానికి ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో లగ్జరీ హౌజింగ్ ప్రాజెక్టుల దూకుడు చాలా బాగా పెరిగిపోయింది. ఇదే సమయంలో అందుబాటు ధరల్లో ఉండే ఇండ్లు తగ్గుముఖం పట్టాయి. గత ఐదేండ్లుగా ఇవి క్రమేణా తగ్గుతూనే ఉండటం గమనార్హం.
-ప్రశాంత్ థాకూర్, అనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్, రీసెర్చ్ హెడ్
అనరాక్ నివేదిక ముఖ్యాంశాలు
- లాభాల్ని పెంచుకోవడం కోసం లగ్జరీ హౌజింగ్వైపే మొగ్గుచూపుతున్న డెవలపర్లు
- సరసమైన ధరల గృహాల నిర్మాణంలో మిగులుతున్నది తక్కువేనంటున్న రియల్టర్లు
- పెరిగిన భూముల ధర, నిర్మాణ వ్యయంతో కష్టంగా మారిన చౌక ప్రాజెక్టులు
- రాబోయే రోజుల్లో ఇంకా తగ్గిపోనున్న అందుబాటు ధరల గృహ నిర్మాణాలు
- హైదరాబాద్ మార్కెట్లో ఖరీదైన నివాసాలకు నానాటికీ పెరుగుతున్న ఆదరణ

Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- homes
- Hyderabad
- luxury homes
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

