Tesla | ముంబైలో టెస్లా తొలి షోరూమ్.. నెల అద్దె ఎంతో తెలుసా..?
Tesla | లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla) భారత్‌లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.
Tesla | లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla) భారత్‌లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. తన తొలి షోరూమ్‌ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai Showroom) ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి.
సీఆర్ఈ మ్యాట్రిక్స్ వివరాల ప్రకారం.. పార్కింగ్ సౌకర్యాలుగల ఈ షోరూమ్ స్పేస్‌కుగాను కంపెనీ ప్రమోటర్, బిలియనీర్ ఎలాన్ మస్క్ నెలకు రూ.35 లక్షల అద్దె (Monthly Rent) చెల్లించనున్నారు. అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి లీజుకి తీసుకుంది. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ దేశీయంగా ఏర్పాటైన తొలి యాపిల్ స్టోర్‌కు దగ్గరగా ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టరైంది. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా కూడా టెస్లా జమ చేసింది.
ఎలన్ మస్క్ సారధ్యంలోని టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ విధించే దిగుమతి సుంకాలు తమకు అడ్డంకిగా మారాయని టెస్లా గతంలోనే పేర్కొంది. అయితే, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవలే అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)తో భేటీ అయ్యారు. ఆ భేటీలో వాణిజ్య అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా టెస్లా భారత్‌లో ప్రవేశానికి సంబంధించిన కీలక అంశాలను కూడా ఇరువురూ ప్రస్తావించినట్లు సమాచారం. మోదీతో భేటీ అయిన రోజుల వ్యవధిలోనే టెస్లా ఈ చర్యలు చేపట్టడం విశేషం.
ఇక భారత్‌లో తొలి రెండు షోరూమ్‌లను ఏర్పాటుకు దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాలను సంస్థ ఎంపిక చేసింది. ఇటీవలే నియామకాల ప్రక్రియ కూడా చేపట్టింది (Tesla Begins Hiring In India). కస్టమర్ రిలేటెడ్, బ్యాక్ఎండ్ జాబ్ సహా 13 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు కావాలంటూ ప్రకటన ఇటీవలే చేసింది. ఇందులో సర్వీస్ టెక్నీషియన్, సలహదారు పోస్టులు వంటి వాటికి ఢిల్లీ, ముంబై నగరాల్లో నియామకాలు చేపడుతున్నట్లు తెలిపింది. మిగిలిన పోస్టులకు ఉద్యోగులను కేవలం ముంబై కేంద్రంగా తీసుకోనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
Also Read..
Donald Trump | భారత్‌పైనా బాదుడే.. ఏప్రిల్ 2 నుంచి సుంకాలు: డొనాల్డ్ ట్రంప్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

