ఆవిషరణల కేంద్రంగా తెలంగాణ
తెలంగాణను ప్రపంచ స్థాయి డీప్ టెక్, ఆవిషరణల కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు.
- ఫికీ వందేండ్ల వేడుకలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణను ప్రపంచ స్థాయి డీప్ టెక్, ఆవిషరణల కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు. బుధవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫికీ) వందేండ్ల వేడుకలు, ‘తెలంగాణ డీప్- టెక్ లీడర్ షిప్ సమ్మిట్’లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమారతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయబోయే ఏఐ, క్వాంటం టెక్నాలజీ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పరిశోధన, ఆవిషరణలు, నైపుణ్యాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఫికీ వందేండ్ల ప్రస్థానం భారత పారిశ్రామిక రంగ పరిణామానికి అద్దం పడుతున్నదని కొనియాడారు. 2025- 26లో రాష్ట్ర జీఎస్వీఏలో పారిశ్రామిక రంగం వాటా 8.1 శాతం వృద్ధి రేటుతో రూ.3.04 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫికీ తెలంగాణ చాప్టర్ ఛైర్మన్ వీవీ రామరాజు, కో-ఛైర్మన్ జయదేవ్, ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ కేకే మహేశ్వరి, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

