Tecno Spark 20C | భారత్ మార్కెట్లో టెక్నో బడ్జెట్ ఫ్రెండ్లీ స్పార్క్ 20 సీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Tecno Spark 20C | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) భారత్ మార్కెట్లో తన టెక్నో స్పార్క్ 20సీ (Tecno Spark 20C) ఫోన్‌ను మంగళవారం ఆవిష్కరించింది.
Tecno Spark 20C | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) భారత్ మార్కెట్లో తన టెక్నో స్పార్క్ 20సీ (Tecno Spark 20C) ఫోన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. గతేడాది నవంబర్ నెలలోనే సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్ కలిగి ఉంటుంది. సింగిల్ ర్యామ్ విత్ స్టోరేజీ వేరియంట్, నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్.
అల్పెన్ గ్లో గోల్డ్, గ్రావిటీ బ్లాక్, మిస్టరీ వైట్, మ్యాజిక్ స్కిన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో టెక్నో స్పార్క్ 20సీ ఫోన్ అందుబాటులో ఉంటది. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 పలుకుతుంది. లాంచింగ్ ఆఫర్ కింద రూ.100 ధర తగ్గించారు. అంటే రూ.7,999లకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. మార్చి ఐదో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.5,604 విలువైన ఓటీటీ ప్లే వార్షిక్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.
టెక్నో స్పార్క్ 20సీ ఫోన్ 6.6 అంగుళాల హెచ్డీ+ (720×1612 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కోసం సెంటర్డ్ హోల్ పంచ్ స్లాట్ ఉంటుంది. ఆపిల్ డైనమిక్ ఐలాండ్ మాదిరిగానే డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఉంటుంది. డార్విన్ ఇంజిన్‌తో వస్తున్న టెక్నో స్పార్క్ 20సీ ఫోన్ యూజర్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ మెరుగు పడుతుంది. మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తున్నది. 8 జీబీ ర్యామ్ తో వస్తున్న ఈ ఫోన్లో మరో 8 జీబీ ర్యామ్ వర్చువల్‌గా పెంచుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో 128 జీబీ స్టోరేజీని ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ హెచ్ఐఓఎస్ 13 వర్షన్‌పై పని చేస్తుంది.
టెక్నో స్పార్క్ 20సీ ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ తో వస్తున్నది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు అన్ స్పెసిఫైడ్ ఏఐ బ్యాక్డ్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 1080పీ టైం ల్యాప్స్ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 18 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో టెక్నో స్పార్క్ 20సీ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. 50 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ కావచ్చు. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

