Tecno Spark 20 Pro+ | వచ్చేనెలలో భారత్ మార్కెట్లోకి టెక్నో స్పార్క్20 ప్రో+.. ఇవీ స్పెషిపికేషన్స్..?!
Tecno Spark 20 Pro+ | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో.. తన టెక్నో స్పార్క్ 20ప్రో + ఫోన్ ను వచ్చేనెలలో భారత్ మార్కెట్లో ఆవిస్కరించనున్నది.
Tecno Spark 20 Pro+ | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) తన టెక్నో స్పార్క్ 20 ప్రో + (Tecno Spark 20 Pro+) ఫోన్‌ను వచ్చేనెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. టెక్నో స్పార్క్20 మోడల్ కొనసాగింపుగా టెక్నో స్పార్క్ 20 ప్రో, టెక్నో స్పార్క్ 20సీ ఫోన్లతోపాటు టెక్నో స్పార్క్20 ప్రో + (Tecno Spark 20 Pro+) ఫోన్ వస్తోంది. మీడియాటెక్ హెలియో జీ99 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో అందుబాటులో ఉంటుంది. వర్చువల్‌గా మరో 8జీబీ ర్యామ్ పెంపుతో 16 జీబీ ర్యామ్ వరకూ పొడిగించుకోవచ్చు. 120 హెర్ట్స్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78-అంగుళాల కర్వుడ్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. అయితే, భారత్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి మాత్రం ఇంకా వెల్లడించలేదు.
టెక్నో స్పార్క్20 + (Tecno Spark 20 Pro+) ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వస్తుంది. 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఎఫ్/1.75 అపెర్చర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఐపీ53 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, స్టీరియో డ్యుయల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుందీ ఫోన్. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెచ్ఐ ఓఎస్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. ఇందులో డైనమిక్ పోర్ట్ ఫీచర్ కూడా జత చేస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

