Tecno Spark 20 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో తన టెక్నో స్పార్క్ 20 ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. తాజా ఐ-ఫోన్ మోడల్స్‌లో ఆపిల్ డైనమిక్ ఐలాండ్ మాదిరిగానే టెక్నో డైనమిక్ పోర్ట్ ఫీచర్ జత చేశారని తెలుస్తున్నది. సైబర్ వైట్, గ్రావిటీ బ్లాక్, మ్యాజిక్ స్కిన్ బ్లూ, నియోన్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని సమాచారం. ఈ ఫోన్ ధర రూ.10,499 లోపే ఉంటుందని తెలుస్తున్నది.
మీడియాటెక్ హెలియో జీ85 చిప్సెట్తో టెక్నో స్పార్క్ 20 ఫోన్ వస్తుందని సమాచారం. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ గా రానున్నది. ఎల్సీడీ స్క్రీన్ విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉంటుందని తెలుస్తున్నది. టెక్నో స్పార్క్ 20 ఫోన్ 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. రెండు ఫోన్లకూ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఫోన్ స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. డీటీఎస్ ఆడియోతో స్టీరియో స్పీకర్లు ఉంటాయి.