Tecno Pova 6 Pro 5G | ఆకర్షణీయ ఫీచర్లతో టెక్నో పోవా6 ప్రో 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Tecno Pova 6 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో.. తన టెక్నో పోవా6 ప్రో 5జీ ఫోన్‌ను భారత్ మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది.
Tecno Pova 6 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) తన టెక్నో పోవా6 ప్రో 5జీ (Tecno Pova 6 Pro 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది. తొలుత గత నెలలో బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో ఈ ఫోన్‌ను ప్రదర్శించింది. ఈ ఫోన్ 6ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ (6nm MediaTek Dimensity 6080 SoC) ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ ఉంటది. 70వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. రెండు ర్యామ్ వేరియంట్లలో వస్తున్న టెక్నో పోవా6 ప్రో 5జీ (Tecno Pova6 Pro 5G) ఫోన్ వచ్చేనెల ప్రారంభం నుంచి సేల్స్ మొదలవుతుంది.
టెక్నో పోవా6 ప్రో 5జీ (Tecno Pova6 Pro 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999లకు లభిస్తుంది. అన్ని బ్యాంకు కార్డులపై బుక్ చేసుకుంటే రూ.2,000 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999లకు లభిస్తుంది. ఈ ఫోన్‌తోపాటు రూ.4,999 విలువ గల టెక్నో ఎస్2 (Tecno S2) స్పీకర్ ఫ్రీగా అందిస్తుంది. అమెజాన్ తోపాటు దేశంలోని అన్ని రిటైల్ స్టోర్లలో ఏప్రిల్ నాలుగో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుక్కోవచ్చు. కామెట్ గ్రీన్, మీటరైట్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
టెక్నో పోవా6 ప్రో 5జీ (Tecno Pova6 Pro 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తోపాటు 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 12 జీబీ ర్యామ్ వేరియంట్ వర్చువల్‌గా మరో 12 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ వర్చువల్ గా మరో 8 జీబీ వరకూ పెంచుకోవచ్చు.
టెక్నో పోవా6 ప్రో 5జీ (Tecno Pova6 Pro 5G) ఫోన్ 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ 3ఎక్స్ ఇన్ సెన్సర్ జూమ్తోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ ఉంటది. 2-మెగా పిక్సెల్ పోర్ట్రైట్ సెన్సర్ కెమెరా, డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు అన్ స్పెసిఫైడ్ ఏఐ బ్యాక్డ్ లెన్స్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ డ్యయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ కెమెరా ఉంటుంది. డైనమిక్ పోర్ట్ 2.0 ఫీచర్ కూడా జత చేశారు. టెక్నో పోవా6 ప్రో 5జీ (Tecno Pova6 Pro 5G) ఫోన్ 70వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఈ ఫోన్ 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

