Tecno Camon 30 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో తన టెక్నో కామోన్ 30 5జీ సిరీస్ ఫోన్లను శనివారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇందులో టెక్నో కామోన్30 5జీ, టెక్నో కామోన్30 5జీ ప్రీమియర్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ సెట్లతోపాటు ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెచ్ఐఓఎస్ 14 ఓఎస్ వర్షన్‌పై పని చేస్తాయి. టెక్నో కామోన్30 5జీ ఫోన్లు త్రీ 50- మెగా పిక్సెల్స్ రేర్ కెమెరాలు కలిగి ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50 -మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 70వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
టెక్నో కామోన్30 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.22,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999 పలుకుతుంది. టెక్నో కామోన్ 30 5జీ ప్రీమియర్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.39,999లకు లభిస్తుంది. ఈ నెల 23 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.3,000 వరకూ ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
టెక్నో కామోన్ 30 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78 అంగుళాల (1080×2436 పిక్సెల్స్) ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లే, 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఇక టెక్నో కామోన్30 5జీ ప్రీమియర్ ఫోన్ 6.77 అంగుళాల (1264×27800 పిక్సెల్స్) 1.5 కే ఎల్టీపీఓ అమోలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది.
టెక్నో కామోన్30 5జీ, టెక్నో కామోన్30 5జీ ప్రీమియర్ ఫోన్లూ రెండు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ రేర్ కెమెరా కలిగి ఉంటాయి. టెక్నో కామోన్30 5జీ ఫోన్ 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, టెక్నో కామోన్30 5జీ ప్రీమియర్ ఫోన్ 50-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా కలిగి ఉంటాయి. రెండు ఫోన్లు వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, జీఎన్ఎస్ఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోపాటు యాక్సెలరో మీటర్, గైరోస్కోప్, ఆంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్ ఉంటాయి.