TCS | పనికి టీసీఎస్ భేష్.. దేశంలోనే అత్యుత్తమ సంస్థ: లింక్డ్ఇన్
దేశంలో అత్యుత్తమ సంస్థల జాబితాను ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ వేదిక లింక్డ్ఇన్ విడుదల చేసింది. టాప్-25 కంపెనీలతో విడుదలైన ఈ వార్షిక లిస్టులో భారతీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరోమారు సత్తా చాటింది.
- టాప్-25లో టెక్నాలజీ కంపెనీలే ముందు
TCS | న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశంలో అత్యుత్తమ సంస్థల జాబితాను ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ వేదిక లింక్డ్ఇన్ విడుదల చేసింది. టాప్-25 కంపెనీలతో విడుదలైన ఈ వార్షిక లిస్టులో భారతీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరోమారు సత్తా చాటింది. తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఈసారీ అగ్రస్థానంలో నిలిచింది. పని చేయడానికి ఉద్యోగులకు అత్యంత అనువైన కంపెనీగా టీసీఎస్ను మించినది భారత్లో మరొకటి లేదని లింక్డ్ఇన్ తేల్చింది. విదేశీ ఐటీ కంపెనీలైన యాక్సెంచర్, కాగ్నిజెంట్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మొత్తానికి టెక్నాలజీ కంపెనీల హవా స్పష్టంగా కనిపించడం విశేషం.
ఈ ప్రాతిపదికన..
మొత్తం 8 కీలక అంశాల ప్రాతిపదికన ఈ జాబితాలోని కంపెనీలకు లింక్డ్ఇన్ ర్యాంకులనిచ్చింది. కెరియర్ పెరుగుదల, నైపుణ్యాభివృద్ధి, సంస్థ స్థిరత్వం, బయటి అవకాశాలు, ఉద్యోగుల సంతృప్తి, వైవిధ్యం, విద్యార్హతలు, దేశవ్యాప్తంగా కంపెనీ కార్యకలాపాల అధారంగా అత్యుత్తమ సంస్థలను ఎంపిక చేశారు. ఇదిలావుంటే టాప్-15 మధ్యశ్రేణి కంపెనీల జాబితానూ లింక్డ్ఇన్ విడుదల చేసింది. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) వేదిక లెంత్రా మొదటి స్థానంలో ఉన్నది. మేక్మైట్రిప్, నైకా, డ్రీమ్11 సంస్థలూ ఈ లిస్టులో ఉన్నాయి. ‘ఈసారి జాబితాలో చోటు సంపాదించిన సంస్థలు.. నేటి ప్రపంచంలో ఉద్యోగుల అనుభవం, నైపుణ్యానికి పెద్దపీట వేయడం కీలకమని రుజువు చేశాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ)కు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు కూడా తమ ఆలోచనా తీరును మార్చుకుంటున్నాయి. అందుకే ఈ పోటీ మార్కెట్లో ఉద్యోగులను ఆకట్టుకోవడంలో ఈ సంస్థలు ముందుంటున్నాయి’ అని లింక్డ్ఇన్ అభిప్రాయపడింది.
లింక్డ్ఇన్ జాబితాలోని టాప్-25 సంస్థలు
l టీసీఎస్ l యాక్సెంచర్ l కాగ్నిజెంట్ l మాక్వెరీ గ్రూప్ l మోర్గాన్ స్టాన్లీ l డెలాయిట్ l ఎండ్రెస్ప్లస్ హోసర్ గ్రూప్ l బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ l జేపీమోర్గాన్ చేజ్అండ్కో l పెప్సీకో l డీపీ వరల్డ్ l హెచ్సీఎల్ టెక్ l ఈవై l ష్నైడర్ ఎలక్ట్రిక్ l అమెజాన్ l కాంటినెంటల్ l మాస్టర్కార్డ్ l ఇంటెల్ కార్పొరేషన్ l ఐసీఐసీఐ బ్యాంక్ l మిషెలిన్ l ఫోర్టివ్ l వెల్స్ ఫార్గో l గోల్డ్మన్ సాచ్స్ l నోవో నోర్డిస్క్ l వియాట్రిస్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

