Techno Pova | టెక్నో పొవా ఫోన్ల ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు.. ఇవీ డిటైల్స్
Techno Pova | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో తన టెక్నో పొవా5, టెక్నో పొవా5 ప్రో ఫోన్లను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. రెండు ఫోన్లూ ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్లతో వస్తున్నాయి.
Techno Pova | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో.. భారత్ మార్కెట్లో టెక్నో పొవా5 (Techno Pova 5), టెక్నో పొవా5 ప్రో (Techno Pova 5 Pro) ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. రెండు ఫోన్లు 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ + డిస్ ప్లేతో వస్తున్నాయి.
టెక్నో పొవా5 ఫోన్ (Techno Pova 5).. 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతోనూ.. టెక్నో పొవా5 ప్రో (Techno Pova 5 Pro) వేరియంట్ 68వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది. రెండు ఫోన్లూ ఈ నెల 14న అంటే సోమవారం మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఆవిష్కరణతోపాటు వీటి ధర ఎంత అన్నది వెల్లడించనున్నది టెక్నో.
రెండు ఫోన్లలోనూ మీడియాటెక్ హెలియో జీ99 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్13 ఆధారిత హెచ్ఐఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్లు పని చేస్తాయి. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు డ్యుయల్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ఇక టెక్నో పొవా5 ఫోన్ మూడు రంగుల ఆప్షన్లు- హరికేన్ బ్లూ, అంబర్ గోల్డ్, మెక్కా బ్లాక్ కలర్స్‌లో, టెక్నో పొవా5 ప్రో వేరియంట్ సిల్వర్ ఫాంటసీ, డార్క్ ఇల్లుషన్ కలర్స్‌లో లభిస్తాయి. డ్యుయల్ 4జీ ఓల్ట్, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్సీ, 3.5 ఆడియో కనెక్టివిటీ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

