Interest on PF | పీఎఫ్‌పై వడ్డీ 40 ఏండ్ల కనిష్ఠం.. అయినా అట్రాక్టివ్.. ఎందుకంటే?!
Interest on PF | ప్రధాన బ్యాంకులు, వివిధ సేవింగ్స్ పథకాల్లో కంటే పీఎఫ్, వీపీఎఫ్‌పై వడ్డీరేట్లే ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉన్నాయి.
Interest on PF | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈవీఎఫ్వో) సబ్స్క్రైబర్ల డిపాజిట్లపై వడ్డీరేటు 8.1 శాతానికి కుదిస్తూ ఈపీఎఫ్‌వో బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం గత వారం ఆమోదించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వివిధ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని 8.5 శాతం నుంచి 8.1 శాతానికి కుదించాలని గత మార్చిలోనే ఈపీఎఫ్‌వో బోర్డు నిర్ణయించింది. ఇది నాలుగు దశాబ్దాల కనిష్టానికి సమానం.
2016-17లో ఐదు కోట్ల మంది సబ్స్క్రైబర్లకు 8.65 శాతం వడ్డీరేటు చెల్లించిన ఈపీఎఫ్‌వో.. 2017-18లో 8.55 శాతం చెల్లించింది. అంతకుముందు కొంచెం ఎక్కువగా 2015-16లో 8.8 శాతం వడ్డీ చెల్లించింది. 2020 మార్చిలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌వో వడ్డీరేటు 8.5 శాతానికి కుదించి వేసింది. 2018-19లో 8.65 శాతం వడ్డీ ఇచ్చిన ఈపీఎఫ్‌వో.. 2019-20లో ఏడేండ్ల కనిష్ఠ స్థాయికి కుదించేసింది. తాజాగా గత ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతానికి కుదిస్తూ ఈపీఎఫ్‌వో తీసుకున్న నిర్ణయం నాలుగు దశాబ్దాల కనిష్టానికి తగ్గించేసింది.
చారిత్రకంగా తక్కువ వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నా.. ఇతర ఫిక్స్డ్ ఇన్‌కం సేవింగ్స్ స్కీమ్స్.. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), ఆర్బీఐ సేవింగ్స్ బాండ్లతో పోలిస్తే ఈపీఎఫ్వోపై వడ్డీరేటు ఎక్కువే. ఎంప్లాయి ప్రావిడెండ్ ఫండ్, వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్ (వీపీఎఫ్) ఇప్పటికీ మదుపర్లకు ఆకర్షణీయంగానే ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లపై ఆఫర్ చేస్తున్న 6-6.5 శాతం వడ్డీరేటు కంటే ఈపీఎఫ్, వీపీఎఫ్ వడ్డీరేటే ఎక్కువ.
వేతన జీవులంతా తమ కనీస వేతనంలో 12 శాతం ఈపీఎఫ్‌లో తప్పనిసరి జమ చేయాలి. అంతే మొత్తం యాజమాన్యం జమ చేస్తుంది. వీపీఎఫ్‌లో రూ.1.5 లక్షల వరకు వార్షిక పెట్టుబడి ద్వారా ఐటీ యాక్ట్ 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇంతకుమించి పెట్టుబడి పెట్టడానికి నిబంధనలు అనుమతించవు. కానీ రూ.2.5 లక్షల వరకూ భాగస్వామ్యంపై వడ్డీకి పన్ను మినహాయింపు పొందవచ్చు.
వివిధ పెట్టుబడి పథకాల్లో వడ్డీరేట్లు ఇలా
గరిష్టంగా సుకన్య సమృద్ధి యోజన పథకంపై 7.60 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీంపై 7.40 శాతం, పీపీఎఫ్‌పై 7.10 శాతం, పదేండ్ల గడువు గల ప్రభుత్వ బాండ్లపై 6.82, ఈపీఎఫ్ & పీపీఎఫ్‌లపై 8.1 శాతం వడ్డీరేటు అమలులో ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- EPF
- Savings Schemes
- vpf
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

