కరోనా సాయానికి ఐటీ మినహాయింపు

- ఉద్యోగులు, సంస్థలకు కేంద్రం ఊరట
- పలు ఆదాయ పన్ను గడువుల పొడిగింపు
న్యూఢిల్లీ, జూన్ 25: కరోనా వైరస్ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వివిధ ఆదాయ పన్ను (ఐటీ) గడువులను పొడిగించింది. ఈ క్రమంలోనే కొవిడ్-19 చికిత్స కోసం ఉద్యోగులకు సంస్థ చేసే చెల్లింపులకు ఐటీ మినహాయింపును ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక ఈ మహమ్మారితో ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు సంస్థల నుంచి వచ్చే ఎక్స్గ్రేషియాలకూ ఆదాయ పన్ను వర్తించబోదని ఓ ప్రకటనలో ఐటీ శాఖ స్పష్టం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంతోపాటు తర్వాతి సంవత్సరాలకూ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. కాగా, ఇతర వ్యక్తుల నుంచి ఈ తరహా ఎక్స్గ్రేషియా అందితే అప్పుడు రూ.10 లక్షల వరకే ఐటీ మినహాయింపు వర్తిస్తుందని చెప్పింది. కరోనా వైద్య చికిత్స నిమిత్తం ఉద్యోగులు వారి సంస్థల నుంచి, సన్నిహితుల నుంచి సాయం పొందుతున్నారని, దానిపై పన్ను భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) తెలిపింది.
ట్యాక్స్ పేయర్స్ కోసం..
కరోనా పరిస్థితుల మధ్య పన్ను చెల్లింపుదారులు వివిధ ఐటీ రూల్స్ ఆచరణకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అందుకే వాటి గడువులను పొడిగిస్తున్నట్లు ఈ సందర్భంగా సీబీడీటీ ప్రకటించింది. ఫామ్ 15సీసీ, ఈఎల్ఎస్లకు సంబంధించిన గడువులనూ పెంచారు. రెసిడెన్షియల్ హౌజ్ ప్రాపర్టీ అమ్మకంపై వచ్చిన మూలధన లాభాలకు సంబంధించిన పన్ను మినహాయింపులకున్న వెసులుబాట్లనూ పొడిగించారు.
- ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకం వివాద్ సే విశ్వాస్ కోసం చెల్లింపుల గడువు ఆగస్టు 31దాకా పొడిగింపు
- అదనపు వడ్డీ మొత్తాలతో అక్టోబర్ 31 వరకు చెల్లింపులకు అవకాశం
- పాన్-ఆధార్ అనుసంధానం చివరి తేదీ 3 నెలలు పొడిగింపు. సెప్టెంబర్ 30దాకా గడువు
- ఉద్యోగులకు ఫామ్ 16లో టీడీఎస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సంస్థలకున్న గడువు జూలై 31 వరకు పెంపు
- 2020-21 జనవరి-మార్చి టీడీఎస్ స్టేట్మెంట్ దాఖలు గడువు జూలై 15కు పొడిగింపు
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- corona help
- it exemption
- tax
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

