Tata Altroz iCNG | టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ బుకింగ్స్ షురూ.. 21 వేలు పే చేస్తే సరి..!
Tata Altroz iCNG | టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్ కారు కోసం ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. ఆసక్తి గల వారు రూ.21 వేలు పే చేసి కారు బుక్ చేసుకోవచ్చు.
Tata Altroz iCNG | టాటా మోటార్స్ తన హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్ట్రోజ్ సీఎన్జీ వర్షన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఐ-సీఎన్జీ’ టెక్నాలజీ వస్తున్న ఆల్ట్రోజ్ సీఎన్జీ కారుపై ఆసక్తి గల వారు రూ.21 వేలు చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ వర్షన కారు నాలుగు వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఎక్స్ఈ, ఎక్స్ఎం+, ఎక్స్‌జడ్, ఎక్స్‌జడ్+ వేరియంట్లలో వస్తున్నది. గత జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారి ఆల్ట్రోజ్ సీఎన్జీ కారును ప్రదర్శించింది. మార్కెట్లో మారుతి సుజుకి బాలెనో సీఎన్జీ, టయోటా గ్లాంజా సీఎన్జీ కార్లకు టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నదని భావిస్తున్నారు.
సీఎన్జీ వర్షన్లో టాటా మోటార్స్ మార్కెట్లోకి తెచ్చిన మూడో మోడల్ కారు ఆల్ట్రోజ్. ఇంతకుముందు ఐ-సీఎన్జీ టెక్నాలజీతో టైగోర్ సెడాన్, టియాగో హ్యాచ్‌బ్యాక్ కార్లను మార్కెట్లోకి తెచ్చింది. టైగోర్, టియాగోలతో పోలిస్తే ఆల్ట్రోజ్ సీఎన్జీ వర్షన్ పూర్తిగా భిన్నం కానున్నది. తొలిసారి ట్విన్ సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీతో భారత్ మార్కెట్లోకి వస్తున్న కారు టాటా ఆల్ట్రోజ్. 30 లీటర్ల సామర్థ్యం గల రెండు సీఎన్జీ సిలిండర్లు కారు వెనుక దిగువన బూట్ స్పేస్‌లో ఏర్పాటు చేస్తారు. సీఎన్జీ కిట్ ఏర్పాటు చేసినా లగేజీ కోసం స్పేస్ మరింత అందుబాటులో ఉంటుంది. స్పేర్ వీల్‌ను బూట్ స్పేస్ నుంచి తొలగిస్తారు.
టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు నాలుగు కలర్ ఆప్షన్లు- ఒపెరా బ్లూ, డౌన్‌టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే, ఎవెన్యూ వైట్ కలర్స్‌లో వస్తున్నది. ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ క్యాబినట్లో లెదరెట్టే సీట్స్ ఐఆర్ఏ కనెక్టెడ్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉంటాయి. టియాగో, టైగోర్ సీఎన్జీ వేరియంట్ల మాదిరిగానే ఆల్ట్రోజ్ సీఎన్జీ కూడా 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ కారు ఇంజిన్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ 73 బీహెచ్పీ విద్యుత్, 95 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ 84.82 బీహెచ్పీ విద్యుత్, 113 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. టియాగో ఐ-సీఎన్జీ మాదిరిగా కిలో సీఎన్జీ గ్యాస్‌పై 27 కి.మీ మైలేజీ ఇస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

