Tata Motors | టాటా మోటార్స్ తన టాటా టియాగో సీఎన్జీ ఏఎంటీ, టైగోర్ సీఎన్జీ వేరియంట్ కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆసక్తిగల కార్ల ప్రేమికులు ఈ కార్లు కావాలంటే రూ.21 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. సీఎన్జీ వేరియంట్లో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ (ఎఎంటీ) వర్షన్ ఆవిష్కరిస్తున్న తొలి కంపెనీగా టాటా మోటార్స్ నిలుస్తుంది.
టాటా టియాగో సీఎన్జీ ఏఎంటీ మూడు వేరియంట్లు – ఎక్స్ టీఏ, ఎక్స్ జడ్+, ఎక్స్ జడ్ ఏ ఎన్ఆర్జీ, టైగోర్ సీఎన్జీ రెండు వేరియంట్లు – ఎక్స్ జడ్‌ఏ, ఎక్స్ జడ్ ఏ+ సీఎన్జీ వేరియంట్లలో లభిస్తున్నది. టాటా మోటార్స్ సీఎన్జీ కార్లలో లగేజీ ఫ్రీ స్పేస్‌గా ఉండేందుకు బూట్ దిగువన ట్విన్ సిలిండర్లు ఉంటాయి. సింగిల్ అడ్వాన్స్ డ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ కలిగి ఉండటంతో ఈ కార్లను నేరుగా సీఎన్జీ మోడ్‌లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లొచ్చు.
టాటా టియాగో, టాటా టైగోర్ కార్లు 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటాయి. ఈ ఇంజిన్ గరిష్టంగా 86 పీఎస్ విద్యుత్, 113 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. పెట్రోల్, సీఎన్జీ వర్షన్ కార్లు 5-స్పీడ్ ఎంటీ, 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లు కలిగి ఉంటాయి. కొత్తగా టొర్నాడో బ్లూ కలర్ లో టియాగో, గ్రాస్ లాండ్ బీజ్ రంగులో టియాగో ఎన్ఆర్జీ, టైగోర్ మీటోర్ బ్రాంజ్ కలర్ ఆప్షన్ ల్లో లభిస్తుంది. టియాగో, టైగోర్, ఆల్ట్రోజ్, పంచ్ మోడల్ కార్లను సీఎన్జీ ఆప్షన్లలో టాటా మోటార్స్ ఆఫర్ చేస్తున్నాయి.