Tata Chief Air India Chairman | మహారాజ చైర్మన్‌గా చంద్రశేఖరన్!
Tata chief Air India Chairman | ఎయిరిండియా నూతన చైర్మన్‌గా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నియమితులయ్యారు.
Tata Chief Air India Chairman |టాటా సన్స్ సొంతం చేసుకున్న ఎయిరిండియా నూతన చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నియమితులు అయ్యారు. సోమవారం జరిగిన ఎయిరిండియా బోర్డు సమావేశంలో చైర్మన్‌గా టాటా సన్స్ చీఫ్ చంద్రశేఖరన్‌ను నియమిస్తూ తీర్మానించింది. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాజీ సీఎండీ అలీసీ జీవర్ఘీస్ వైద్యన్‌ను బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించింది. వీరిద్దరి నియామకానికి సెక్యూరిటీ క్లియరెన్స్‌లను కూడా ఎయిరిండియా బోర్డు ఇచ్చేసింది. టాటా సన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ గత నెలలో మరో ఐదేండ్ల పదవీ కాలం పొడిగింపు తర్వాత ఆయన ఎయిరిండియా చైర్మన్‌గా నియమితులయ్యారు.
ఎయిరిండియాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సంస్థకు నూతన సీఈవో కోసం టాటా సన్స్ వెతుకుతున్నది. టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఈవో ఇల్కర్ ఐకీని మహారాజ సీఈవోగా నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఎయిరిండియా బోర్డు పునర్వ్యవస్థీకరణలో భాగంగా హెచ్‌యూఎల్ చైర్మన్ సంజీవ్ మెహతాను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. కొత్తగా ఏర్పాటైన ఎయిరిండియా బోర్డు మంగళవారం సంస్థ పూర్వ వైభవానికి తీసుకునే చర్యలపై ప్రకటన చేయనున్నదని భావిస్తున్నారు.
అంతకుముందు ఎయిరిండియా బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు చంద్రశేఖరన్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని మహారాజ ప్రధానకార్యాలయానికి చేరుకున్నారు. సంస్థ పూర్వ వైభవం తేవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన డిటైల్డ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత జనవరిలో ఎయిరిండియాను టాటా సన్స్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

