సూరత్ వస్త్ర పరిశ్రమపై తాలిబన్ల దెబ్బ.. వందల కోట్లలో బకాయిలు

అహ్మదాబాద్: గుజరాత్‌లోని ప్రసిద్ధ సూరత్ వస్త్ర పరిశ్రమపై తాలిబన్లు దెబ్బకొట్టారు. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో సూరత్‌కు చెందిన వందలాది టెక్స్టైల్ వ్యాపారులకు సుమారు రూ.400 కోట్లకుపైగా బకాయిలు నిలిచిపోయాయి. వీరంతా ఈ చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ బకాయిలు అందకపోతే దారుణంగా నష్టపోతామని వస్త్ర వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
సూరత్‌లోని సుమారు 150 మంది టెక్స్‌టెల్ వ్యాపారులు ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్‌తోపాటు పలు దేశాలకు వస్త్రాలు ఎగుమతి చేస్తుంటారు. ప్రతి ఏటా రూ.1,000 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల వరకు దుస్తుల వ్యాపారం జరిగేది. జీఎస్టీ, కరోనాకు ముందు 2,500 కోట్ల మీటర్ల వస్త్రాలు మార్కెట్లో డంప్ అయ్యేవి. జీఎస్టీ అమలు, కరోనా వల్ల లాక్డౌన్ పరిణామాల నేపథ్యంలో ఇది 1,500 కోట్ల మీటర్లకు పడిపోయింది.
మరోవైపు ఆకస్మాత్తుగా తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశంలోని వస్త్ర వ్యాపారులు తమ షాపులు మూసివేశారు. వ్యాపారాన్ని నిలిపివేశారు. కొందరు దేశం విడిచి వెళ్లిపోయారు. సూరత్‌లోని వస్త్ర పరిశ్రమపై ఇది బాగా ప్రభావం చూపింది. ఆఫ్ఘనిస్థాన్‌తో వస్త్ర వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు ఎగుమతి చేసిన వస్త్రాలకు సంబంధించి రూ.400 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిల రాకతోపాటు వస్త్ర పరిశ్రమ భవిష్యత్తుపై సూరత్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

