హెచ్‌సీఎల్‌తో టీ-హబ్ జట్టు

- టెక్నాలజీ స్టార్టప్స్‌కు ఊతమిచ్చేందుకు భాగస్వామ్యం
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ స్టార్టప్స్‌కు ఊతమివ్వడానికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌తో తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టం బిల్డర్ టి-హబ్ భాగస్వామైంది. వివిధ దశల్లో సహకారం అందించేందుకు ఇఎస్టిప్-హెచ్సీఎల్స్ కార్యక్రమంతో స్టార్టప్స్‌ని టి-హబ్ అనుసంధానించనున్నది. ఈ భాగస్వామ్యం ద్వారా హెచ్‌సీఎల్ వినియోగదారులు, భాగస్వాములు అనుసరించే విధానాల సామర్థ్యాలను పెంచడంతోపాటు స్టార్టప్స్ వృద్ధి అవకాశాలు పెరుగుతాయని ఈ సందర్భంగా గురువారం టి-హబ్ సీఈవో రవి నారాయణ్ అన్నారు. టి-హబ్‌తో ఈ ఒప్పందం ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారిత ఆవిష్కరణల పెరుగుదలకు దోహదం చేస్తుందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అండ్ హెడ్ కళ్యాణ్ కుమార్ అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

