హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): వైద్య, ఆరోగ్య రంగంలో సరికొత్త స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకుగాను అటల్ ఇన్నోవేషన్ సెంటర్‌తో కలిసి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మెడికల్ రీసెర్చ్‌లో పరిశోధనలు చేసి, ఉత్పత్తులు తయారు చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు నాల్గో విడతలో భాగంగా ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
టెక్నాలజీ స్టార్టప్‌ల కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌తో కలిసి మూడు విడతలుగా ప్రోత్సాహక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. ఔత్సాహికులు మరిన్ని వివరాలకు (https://bit.ly/3sup CfM)లో సంప్రదించాలని టీ హబ్ సూచించింది.