Swiggy | ఇన్‌స్టామార్ట్‌లో స్విగ్గీ 70 కోట్ల డాలర్ల పెట్టుబడి!
Swiggy | స్విగ్గీ తన క్యూ-కామర్స్ సంస్థ ఇన్‌స్టామార్ట్ సేవలు విస్తరించనున్నది. పావుగంటలో సరుకుల డెలివరీ చేయనున్నది.

Swiggy | ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తన ఈ-కామర్స్ బిజినెస్ సంస్థ ఇన్‌స్టామార్ట్‌లో రూ.5,250 కోట్లు (700 మిలియన్ల డాలర్లు) పెట్టుబడి పెడతామని శుక్రవారం తెలిపింది. తద్వారా గ్రాసరీ డెలివరీ సేవలను విస్తరించనున్నది. గతేడాది గుర్‌గ్రామ్, బెంగళూరుల్లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సేవలు మొదలయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్, విశాఖపట్నంతోపాటు 18 నగరాల్లో ఈ సేవలందిస్తున్నది. తాజా ఫలాలు, వెజిటబుల్స్, బ్రెడ్, ఎగ్స్ తదితర సరుకులను ఇన్‌స్టామార్ట్ తన ఖాతాదారులకు సరఫరా చేస్తున్నది. ప్రతి వారంలో 10 లక్షలకు పైగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్నట్లు స్విగ్గీ వెల్లడించింది.
వచ్చే ఏడాది జనవరి (2022 జనవరి) నాటికి మెజారిటీ ఖాతాదారుల సమీపంలోని స్టోర్లతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటామని స్విగ్గీ తెలిపింది. తమకు ఆర్డర్ ఇచ్చిన 15 నిమిషాల్లో కస్టమర్లకు సరుకులు డెలివరీ చేస్తామన్నది. సాధారణంగా సంప్రదాయ ఈ-కామర్స్ పద్దతిలో ఉత్పత్తుల డెలివరీకి ఒక రోజైనా పడుతుంది. కానీ క్యూ-కామర్స్‌తో తక్కువ పరిమాణం గల ఉత్పత్తులను చాలా తక్కువ టైంలో కస్టమర్లకు అందించొచ్చు.
స్విగ్గీ ప్రత్యర్థి సంస్థ జొమాటో తన అనుబంధ క్యూ-కామర్స్ విభాగ సంస్థలు గ్రోఫర్స్, డన్జోలతో ఇన్‌స్టామార్ట్ పోటీపడుతుంది. దేశీయంగా క్యూ-కామర్స్ రంగం విలువ ప్రస్తుతం 30 కోట్ల డాలర్లు. వచ్చే నాలుగేండ్లలో 500 బిలియన్ డాలర్లకు చేరుతుందని కన్సల్టెన్సీ సంస్థ రెడ్ సీర్ పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

