Swiggy Credit Card | కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు బాటలో స్విగ్గీ..!
Swiggy Credit Card | హెచ్డీఎఫ్సీ బ్యాంకు, మాస్టర్ కార్డ్ నెట్ వర్క్ సాయంతో ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ తన యూజర్ల కోసం త్వరలో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు జారీ చేయనున్నది.
Swiggy Credit Card | స్విగ్గీ.. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌గా పేరొందింది. తాజాగా స్విగ్గీ.. మైంత్రా, పేటీఎం, ఫ్లిప్‌కార్ట్ బాటలో పయనించాలని తలపోస్తున్నది. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు జారీ చేసేందుకు సిద్ధమైంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు జారీ చేయాలని స్విగ్టీ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును వాడుతున్న క్రెడిట్ కార్డు యూజర్లకు డిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్లు అందించడానికి ఇతర కార్డులపై ఆధార పడి పని చేస్తున్నదీ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ. తాజాగా స్విగ్గీ తీసుకొస్తున్న కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ఉపయోగించిన వారికి డైన్ ఔట్, స్విగ్గీ రెస్టారెంట్ బిల్లు చెల్లింపులపై అదనపు డిస్కౌంట్లు ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో కలిసి స్విగ్గీ జారీ చేయనున్న కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులో మాస్టర్ కార్డు.. నెట్వర్క్ పార్టనర్‌గా చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు వల్ల ఫుడ్ డెలివరీ యాప్‌కు ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయి.
గత ఏడాది కాలంగా కో క్రెడిట్ కార్డు జారీ కోసం స్విగ్గీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం బ్యాంకులు, ఫిన్ టెక్ కంపెనీల భాగస్వామ్యం కోసం సంప్రదింపులు జరుపుతున్నది. కొద్ది వారాల్లో స్విగ్గీ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు జారీ అవుతుందని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. జొమాటో 2020లోనే కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు జారీ చేసిన.. తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

