Suzuki-Hayabusa | దేశీయ మార్కెట్లోకి సుజుకి సూపర్ బైక్ హాయబుసా.. 2.86 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్
Suzuki-Hayabusa | సుజుకి మోటార్ సైకిల్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి బీఎస్-6 2.0, ఆర్డీఈ నిబంధనలకు అనుగుణంగా సూపర్ బైక్ హయబుసా ఆవిష్కరించినట్లు తెలిపింది.
Suzuki-Hayabusa | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి ఫేమస్ సూపర్ బైక్ `హయబుసా`ను ఆవిష్కరించింది. కర్బన ఉద్గారాల నియంత్రణకు అమల్లోకి తెచ్చిన బీఎస్-6 2.0, రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) నిబంధనలకు అనుగుణంగా హయబుసా బైక్ మార్కెట్లోకి తెచ్చింది. ఇక నుంచి ఈ బైక్ ఈ-20 పెట్రోల్‌తో నడుస్తుంది. దీని ధర రూ.16.90 లక్షలుగా ఖరారు చేశారు. కస్టమర్ల నుంచి బైక్ బుకింగ్స్ కూడా శనివారం ప్రారంభం అయ్యాయి.
1340సీసీ ఇన్లైన్-ఫోర్ సిలిండర్ డీవోహెచ్సీ ఇంజిన్‌తో సుజుకి-2023 హాయ్బుసా బైక్ వస్తున్నది. ఈ ఇంజిన్ 190 బీహెచ్పీ పవర్, గరిష్టంగా 142 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్, ఏబీఎస్, త్రీ పవర్ మోడ్స్, పలు ఫీచర్లతోపాటు క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కూడా కలిగి ఉంది. కేవలం 2.86 సెకన్లలో 100 కి.మీ. వేగంతో దూసుకెళ్లడం దీని స్పెషాలిటీ. బైక్ మెకానిజంలో ఎటువంటి మార్పులు తీసుకు రాలేదు.
టీవీఎస్ మోటార్ సైకిల్ హాయ్బుసా-2023 బైక్ డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. మెటాలిక్ థండర్ గ్రే విత్ క్యాండీ డేరింగ్ రెడ్, మెటాలిక్ మ్యాట్టే బ్లాక్ విత్ గ్లాస్ స్కార్కిల్ బ్యాక్, పెర్ల్ విగోర్ బ్లూ విత్ పెర్ల్ బ్రిలియంట్ వైట్ రంగుల్లో వస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

