Suzuki Hayabusa | 25వ వార్షికోత్సవ సుజుకి హాయబుసా బైక్ ఎడిషన్.. దీని ధరెంతంటే..?!
Suzuki Hayabusa | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ తన హాయబుసా 25వ వార్షికోత్సవం సందర్భంగా సుజుకి హాయబుసా (Suzuki Hayabusa) 25వ వార్షికోత్సవ ఎడిషన్ బైక్ ఆవిష్కరించింది.
Suzuki Hayabusa | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ తన హాయబుసా 25వ వార్షికోత్సవం సందర్భంగా సుజుకి హాయబుసా (Suzuki Hayabusa) 25వ వార్షికోత్సవ ఎడిషన్ బైక్ ఆవిష్కరించింది. దీని ధర రూ.17.7 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలికింది. 1998లో తొలుత జర్మనీలోని ఇంటర్ మోట్లో ప్రదర్శించిన సుజుకి హాయబుసా జీఎస్ఎక్స్1300ఆర్ మోటార్ సైకిల్ విక్రయాలు 1999లో ప్రారంభం అయ్యాయి. 2016లో భారత్ లో ఉత్పత్తి చేసి విక్రయించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న థర్డ్ జనరేషన్ హాయబుసా బైక్ తొలుత 2021లో మార్కెట్లోకి ఎంటరైంది.
టీవీఎస్ మోటార్ ఇండియా వారి సుజుకి హాయబుసా మోటార్ సైకిల్ 1340సీసీ ఇన్ లైన్ 4-సిలిండర్ ఫ్యుయల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ డీఓహెచ్సీ ఇంజిన్ తో వచ్చింది. ఇది సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ (ఎస్ఐఆర్ఎస్) విత్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ బై డైరెక్షనల్ క్విక్ షిఫ్ట్ సిస్టమ్స్ రూపుదిద్దుకున్నది.
సుజుకి హాయబుసా 25వ వార్షికోత్సవ ఎడిషన్ ఆరేంజ్, బ్లాక్ బేస్డ్ బాడీతో వస్తుంది. గోల్డ్ అనోడైజ్డ్ డ్రైవ్ చైన్ అడ్జస్టర్, ఫ్రంట్ బ్రేక్ డిస్క్ ఇన్నర్, డ్రైవ్ చైన్ అండ్ మఫ్లర్ బాడీపై ఒర్జినల్ ఎంగ్రావింగ్స్ ఉంటాయి. ట్యాంకుపై త్రీ డైమెన్షనల్ సుజుకి లోగో, 25వ వార్షికోత్సవ ఎంబ్లం ఉంటాయి. సెలబ్రిటీ ఎడిషన్‌గా వస్తున్న సుజుకి హాయబుసా బైక్ సింగిల్ సీట్ స్టాండర్డ్‌గా ఉంటుంది. భారత్ లోని అన్ని డీలర్ షిప్పుల వద్ద సుజుకి హాయబుసా 25వ వార్షికోత్సవ ఎడిషన్ బైక్ అందుబాటులో ఉంటది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

