SUV Cars | రూ.7 లక్షల్లోపు ఎస్యూవీ కార్లివే.. ఎక్స్టర్ టూ కైగర్.. ఇవీ డిటైల్స్..!
SUV Cars | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎస్ యూవీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. హ్యుండాయ్ ఎక్స్టర్, టాటాపంచ్, నిసాన్ మ్యాగ్నైట్, రెనాల్ట్ కైగర్ వంటి ఎస్ యూవీ కార్లు రూ.7 లక్షల్లోపు ధరకే లభిస్తాయి.
SUV Cars | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. కుటుంబ సభ్యులంతా హాయిగా ప్రయాణించడానికి వీలుగా ఉన్న ఎస్యూవీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. రోజురోజుకి ఎస్యూవీ కార్ల విక్రయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ ధర అంటే రూ.7 లక్షల్లోపు ధరకు అందుబాటులో ఉన్న ఎస్యూవీ కార్ల గురించి తెలుసుకుందామా..
హ్యుండాయ్ ఎక్స్టర్ ఇలా

దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా ఆవిష్కరించిన ఎస్యూవీ ఎక్స్టర్ కారు ధర రూ.6.13 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. 1.2-లీటర్ల కప్పా పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 83 పీఎస్ విద్యుత్, 114 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నది.
ఇలా టాటా పంచ్

టాటా మోటార్స్ మైక్రో ఎస్యూవీ టాటా పంచ్ ధర రూ.6.13 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు 1.2 లీటర్ల రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 88 పీఎస్ విద్యుత్, 115 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లలో లభిస్తుంది.
రూ.6 లక్షలకే నిసాన్ మ్యాగ్నైట్

జపాన్ కార్ల తయారీ సంస్థ నిసాన్ మ్యాగ్నైట్ కారు బీ4డీ 1.0-లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 72 పీఎస్ విద్యుత్, 96 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లలో లభిస్తుంది. మ్యాగ్నైట్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ధర రూ.6 లక్షలు (ఎక్స్ షోరూమ్), మ్యాగ్నైట్ ఏఎంటీ ధర రూ.6.60 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. దేశంలో అత్యంత చౌకగా అందుబాటులో ఉన్న ఆటోమేటిక్ ఎస్యూవీ కార్లలో ఇదొకటి.
రూ.6 లక్షలకే రెనాల్ట్ కైగర్

రెనాల్ట్ కైగర్ కారు రూ.6 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. 1.0 లీటర్ల ఎనర్జీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ గల కారు ఇంజిన్ గరిష్టంగా 72 పీఎస్ విద్యుత్, 96 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. రెనాల్ట్ కైగర్ ఏఎంటీ ధర రూ.7 లక్షల (ఎక్స్ షోరూమ్) పైమాటే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

