Suniel Shetty | స్విగ్గీ, జొమాటోలకు దీటైన పోటీ : ఫుడ్ డెలివరీ యాప్‌ను ప్రారంభించిన సునీల్ శెట్టి
బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి (Suniel Shetty) బ్రాండ్ అంబాసిడర్‌గా వాయు పేరుతో మరో ఫుడ్ డెలివరీ యాప్ ప్రారంభమైంది.
ముంబై : బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి (Suniel Shetty) బ్రాండ్ అంబాసిడర్‌గా వాయు పేరుతో మరో ఫుడ్ డెలివరీ యాప్ ప్రారంభమైంది. ఇతర ఫుడ్ డెలివరీ యాప్‌లతో పోలిస్తే 15 నుంచి 20 శాతం తక్కువ ధరలో వాయు సేవలందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ యాప్‌తో ముంబై హోటళ్లు తమ సొంత ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చారు.
ముంబై హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఆహార్) సహకారంతో టెక్ ఎంట్రప్రెన్యూర్లు అనిరుధ కోట్గిర్, మందర్ లండే నేతృత్వంలోని డెస్టెక్ హొరెకా వాయు యాప్‌ను లాంఛ్ చేసింది. ఈ యాప్‌నకు సునీల్ శెట్టిని బ్రాండ్ అంబాసిడర్‌గా కంపెనీ నియమించింది. ఈ యాప్ కస్టమర్లను భగత్ తారాచంద్, మహేష్ లంచ్ హోం, బనానా లీఫ్, శివసాగర్, గురు కృప, కృతి మహల్, పెర్షియన్ దర్బార్, లడు సామ్రాట్ వంటి వేయికి పైగా ముంబై రెస్టారెంట్లతో కనెక్ట్ చేస్తుంది.
రెస్టారెంట్ల నుంచి వాయు ఎలాంటి కమీషన్, ఫీజును వసూలు చేయదని, కస్టమర్లకు మెరుగైన నాణ్యతతో, తక్కువ ధరలకే సేవలను అందిస్తుందని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. అధిక ధరలు, సర్వీసులో జాప్యం, కస్టమర్ సపోర్ట్ కొరవడటం వంటి సమస్యల నుంచి కస్టమర్లకు ఉపశమనం కల్పిస్తూ మెరుగైన సేవలు అందిస్తుందని చెప్పారు.
Read More
Viral video | మెట్రో రైల్లో బరితెగించిన యువ జంట.. అందరూ చూస్తుండగానే ముద్దుల్లో మునక
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

