Stocks | మూడు రోజుల లాభాలకు బ్రేక్.. ఫస్ట్ టైం 77 వేల మార్క్ దాటిన సెన్సెక్స్..!
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడు సెషన్లలో లాభాలకు బ్రేక్ పడింది. స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ముగిసినా బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారి 77 వేల మార్కును దాటేసింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడు సెషన్లలో లాభాలకు బ్రేక్ పడింది. ఐటీ స్టాక్స్‌తోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ వంటి బ్లూ చిప్ కంపెనీల స్టాక్స్ పతనం కావడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 203 పాయింట్ల (0.27 శాతం) నష్టంతో 76,490 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 31 పాయింట్ల (0.13 శాతం) పతనంతో 23,259 పాయింట్ల వద్ద స్థిర పడ్డాయి.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 77,079 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 77 వేల మార్కును దాటడం ఇదే మొదటిసారి. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం అంతర్గత ట్రేడింగ్ లో 23,400 పాయింట్ల మార్కును దాటి 23,412 పాయింట్ల ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుకున్నది.
టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టైటాన్, ఐటీసీ స్టాక్స్ 0.5 నుంచి 2.6 శాతం వరకూ నష్టాలతో ముగిశాయి. మరోవైపు బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.56 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఒక శాతం లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.8 శాతం, నిఫ్టీ మెటల్ 0.38 శాతం నష్టపోగా, నిఫ్టీ మీడియా ఇండెక్స్ దాదాపు రెండు శాతం లాభ పడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

