హైదరాబాద్ (సిటీబ్యూరో), ఫిబ్రవరి 18 : స్టార్టప్‌లు అభివృద్ధి చెందాలన్నా, వాటి వ్యాపార కార్యకలాపాలు విస్తరించాలన్నా సరైన సమయంలో నిధులు చాలా కీలకం. అలాంటి సమస్య లేకుండా తాము అనుకున్న ఆలోచనలతో ఆవిష్కరణలు చేసే స్టార్టప్ వ్యవస్థాపకులకు దోహదపడే స్టార్టప్ ఇన్వెస్టర్ కనెక్ట్ కార్యక్రమాన్ని ఈ నెల 25న టీ హబ్ నిర్వహిస్తున్నది. పెట్టుబడిదారులతో నేరుగా సమావేశమై స్టార్టప్ ఆలోచనను సరైన విధంగా వివరించేందుకు సిద్దంగా ఉండాలి. 5 నిమిషాల్లో అర్థమయ్యేలా తమ ఆలోచన, ఆవిష్కరణలను వివరించాల్సి ఉంటుంది. సమాచారం కోసం https:// bit.ly/3oUYxx8లో సంప్రదించాలి.