క్లెయిమ్స్ సెటిల్మెంట్లలో స్టార్
దేశీయ అతిపెద్ద రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్) రికార్డు సృష్టించింది. హెల్త్ బీమా సేవలు ప్రారంభించిన 2006 నుంచి ఇప్పటి వరకు కోటికి పైగా క్లెయిమ్‌లను పరిష్కరించింది.
హైదరాబాద్, మార్చి 6: దేశీయ అతిపెద్ద రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్) రికార్డు సృష్టించింది. హెల్త్ బీమా సేవలు ప్రారంభించిన 2006 నుంచి ఇప్పటి వరకు కోటికి పైగా క్లెయిమ్‌లను పరిష్కరించింది. ఈ మైలురాయికి చేరుకున్న దేశీయ తొలి స్వతంత్ర ఆరోగ్య బీమా కంపెనీ ఇదే కావడం విశేషం. ఈ అవధిలో కంపెనీ దేశవ్యాప్తంగా నగదు రహిత, రీయంబర్స్మెంట్ క్లెయిమ్‌ల కోసం రూ.44 వేల కోట్లకు పైగా చెల్లింపులు జరిపింది. వినియోగదారులు సంస్థపై ఉంచిన నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శణమని కంపెనీ ఎండీ, సీఈవో ఆనంద్ రాయ్ తెలిపారు. దేశవ్యాప్తంగా సంస్థకు 877 శాఖలు ఉండగా, ఎక్కువ క్లెయిమ్‌లు మహారాష్ట్రలోనే పరిష్కరించింది. ఆ తర్వాతి రాష్ర్టాల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఢిల్లీలు ఉన్నాయి.
సంస్థ సెటిల్ చేసిన క్లెయిమ్‌లలో 14 శాతం సీనియర్ సిటిజన్లకు సంబంధించినవి కాగా, 61 శాతం ఇతరులవి, 25 శాతం పిల్లలకు సంబంధించినవని పేర్కొన్నారు. ఈ గణాంకాలు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని వయస్సుల వారి విసృ్తత శ్రేణిని చాటి చెబుతున్నదన్నారు. జీవితంలోని ప్రతి దశలో ఆరోగ్య బీమా కవరేజ్ ప్రాముఖ్యత ఉన్నదని, ప్రస్తుతం ప్రాథమిక అవసరంగా మారిందన్నారు. జ్వరం, అంటు వ్యాధులు క్లెయిమ్‌లకు ప్రముఖ కారణాలు కాగా, మొత్తం క్లెయిమ్‌లలో వీటి వాటా 20 శాతంగా ఉన్నదన్నారు. మిగతా క్లెయిమ్‌లలో జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటరాలజి, ఆర్థోపెడిక్స్‌కు సంబంధించిన క్లెయిమ్‌లు తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

