బెంగళూరు, మే 13: ప్రాంతీయ విమానసేవల సంస్థ స్టార్ ఎయిర్..బెంగళూరు-హైదరాబాద్-జామ్‌నగర్ రూట్లో ఎంబ్రాయిర్ ఈ175 జెట్ విమాన సర్వీసును శనివారం ప్రారంభించింది. ప్రస్తుతం వారానికి మూడు రోజులు(మంగళ, గురు, శనివారాల్లో) మాత్రమే నడవనున్న ఈ సర్వీసులో బిజినెస్ క్లాస్‌తోపాటు ఎకనమి క్లాస్ సీట్లను ఆఫర్ చేస్తున్నది.
ఈ రూట్లో బిజినెస్ క్లాస్ సేవలు అందిస్తున్న తొలి ప్రాంతీయ విమాన సేవల సంస్థ స్టార్ ఎయిర్ కావడం విశేషం. సంస్థ ఇటీవల 76 సీట్ల కెపాసిటీ కలిగిన ఈ175 జెట్‌ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ విమానంలో బిజినెస్ క్లాస్ సీట్లు 12 ఉండగా, 64 సీట్లు ఎకనమికి సంబంధించినవి. 2019 జనవరిలో విమాన సేవలు అందించిన కంపెనీ ఏడు ఎయిర్‌క్రాఫ్ట్‌లతో 18 నగరాలకు విమాన సేవలు అందిస్తున్నది.