SpiceJet-Lay Offs | స్పైస్ జెట్ పొదుపు చర్యలు.. 1500 మందిపై వేటుకు కసరత్తు..?!
SpiceJet-Lay Offs | నిధుల కొరతతో సతమతం అవుతున్న ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘స్పైస్ జెట్’ పొదుపు చర్యలకు శ్రీకారం చుడుతున్నది. వచ్చే నెలాఖరులోపు 15 శాతం మంది సిబ్బందిని ఇంటికి సాగనంపాలని భావిస్తున్నదని సమాచారం.
SpiceJet-Lay Offs | నిధుల కొరతతో సతమతం అవుతున్న ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘స్పైస్ జెట్’ పొదుపు చర్యలకు శ్రీకారం చుడుతున్నది. వచ్చే నెలాఖరులోపు 15 శాతం మంది సిబ్బందిని ఇంటికి సాగనంపాలని భావిస్తున్నదని సమాచారం. కొవిడ్-19 మహమ్మారి తర్వాత విమాన సర్వీసులు తగ్గించి వేసింది. కానీ అవసరానికి మించిన సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నారు. కరోనా సమయంలో 120 విమాన సర్వీసులు నడిపితే ప్రస్తుతం 40 సర్వీసులు మాత్రమే నిర్వహిస్తున్నది.
2023 మార్చి నెలాఖరు నాటికి మొత్తం 10,060 మంది ఉద్యోగులు స్పైస్ జెట్’లో పని చేస్తున్నారు. వారిలో 7,131 మంది శాశ్వత సిబ్బంది ఉన్నారు. సిబ్బంది క్రమబద్ధీకరణ వల్ల సంస్థ ఏటా రూ.100 కోట్లు ఆదా చేయగలుగుతుందని స్పైస్ జెట్ ఓ ప్రకటనలో తెలిపింది. కానీ ఎంత మందిని తొలగిస్తున్నారన్న సంగతిని వెల్లడించలేదు. ప్రాఫిటబుల్ గ్రోత్ సాధించేందుకు ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ఉద్యోగులను తొలగించాలని యాజమాన్యం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

