Sovereign Gold Bond | 12 నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ల సబ్స్క్రిప్షన్.. యూనిట్ విలువ ఇలా..!
Sovereign Gold Bond | బంగారం కొనుగోళ్లను నిరుత్సాహ పరిచేందుకు కేంద్రం తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. తాజాగా ఈ నెల 12 నుంచి ఐదు రోజులు అంటే 16వ తేదీ వరకూ సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) సబ్ స్క్రిప్షన్ చేసుకోవచ్చు.
Sovereign Gold Bond | బంగారం కొనుగోళ్లను నిరుత్సాహ పరిచేందుకు కేంద్రం తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. తాజాగా ఈ నెల 12 నుంచి ఐదు రోజులు అంటే 16వ తేదీ వరకూ సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) సబ్ స్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఒక యూనిట్ ‘ఎస్జీబీ’ విలువ అంటే ఒక గ్రామ్ బంగారం విలువ రూ.6,263గా ఆర్బీఐ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగో సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్ ఇది. ఇంతకుముందు గతేడాది జూన్, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో ఆర్బీఐ మూడు విడుతల్లో ‘ఎస్ జీబీ’లను మార్కెట్లో రిలీజ్ చేసింది. ఆన్ లైన్ లో ఎస్జీబీ కొనుగోలు చేసే వారికి గ్రామ్ బంగారంపై రూ.50 డిస్కౌంట్‌తో రూ.6,213లకే విక్రయిస్తుంది. దేశీయంగా బంగారం కొనుగోళ్లను నిరుత్సాహ పరిచేందుకు 2015 నవంబర్‌లో తొలిసారి కేంద్ర ప్రభుత్వం ఎస్జీబీ పథకం తెచ్చింది.
ఇక సబ్స్క్రిప్షన్ ముందు వారంలో చివరి మూడు పని దినాల్లో 24 క్యారట్ల (999 స్వచ్ఛత) గల బంగారంపై ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ నిర్ణయించిన సగటు ఆధారంగా యూనిట్ (ఒక గ్రామ్) ఎస్జీబీ విలువను ఆర్బీఐ ఖరారు చేస్తుంది. ప్రతి ఒక్కరూ కనీసం ఒక (గ్రామ్ బంగారం) యూనిట్‌పై పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు నాలుగు కిలోలు, ట్రస్టులు 20 కేజీల వరకూ కొనుగోలు చేయొచ్చు. ఈ బాండ్ పీరియడ్ ఎనిమిదేండ్లు. గడువు ముగిసిన తర్వాత మెచ్యూరిటీ తేదీ నాటికి బంగారం విలువ ఆధారంగా చెల్లిస్తారు. ఐదేండ్ల తర్వాత బాండ్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించవచ్చు. ఫిజికల్‌గా బంగారం కొనుగోళ్లకు వర్తించే కేవైసీ నిబంధనలే ‘ఎస్జీబీ’లకూ వర్తిస్తాయి.
షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బీఎస్ఈ లేదా ఎన్ఎస్ఈ వంటి స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ఎస్ జీబీల కొనుగోలుకు అప్లయ్ చేయొచ్చు. బాండ్ నామ మాత్రపు విలువపై ఏటా 2.5 శాతం ఫిక్స్ డ్ వడ్డీరేటు చెల్లిస్తారు.
ఇక బాండ్లపై వచ్చే పెట్టుబడి లాభాలపై పన్ను మినహాయింపు లభిస్తుంది. బాండ్లు కొనుగోలు చేసిన ఐదేండ్ల తర్వాత విత్ డ్రా చేసుకుంటే వచ్చే ఆదాయం.. మీ ఆదాయం శ్లాబ్ ఆధారంగా ఆదాయం పన్ను చెల్లించాల్సిందే. ఫిజికల్ బంగారంతో పోలిస్తే సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడంతో పలు ప్రయోజనాలు ఉన్నాయి. బంగారం కొనుగోలులో సాధారణంగా వర్తించే మేకింగ్, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు, పన్నులు వర్తించవు. బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు సావరిన్ గోల్డ్ బాండ్లలో మదుపు చేసే అంశాన్ని పరిశీలించవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

