Gold Bond | ఫస్ట్ గోల్డ్ సావరిన్ బాండ్ స్కీమ్.. సబ్స్క్రిప్షన్ ఎప్పటి నుంచంటే..?!
Gold Bond | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి సావరిన్ గోల్డ్ బాండ్ల స్కీం ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19 నుంచి 23 వరకు కొనసాగుతుందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.
Gold Bond | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలిసారి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం సబ్ స్క్రిప్షన్కు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 19 నుంచి అంటే వచ్చే సోమవారం నుంచి సబ్స్క్రిప్షన్ ప్రారంభం అవుతుంది. ఒక్కో గ్రామ్ మీద రూ.5926 చొప్పున ఇష్యూ ధర నిర్ణయించారు. ఈ నెల 23 వరకు సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చునని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. కేంద్రం తరపున ఈ బాండ్లు ఆర్బీఐ జారీ చేసింది.
ఆర్బీఐ జారీ చేసే గోల్డ్ సావరిన్ బాండ్లను సెలెక్టెడ్ పోస్టాఫీసులు, బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్), ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో విక్రయిస్తారు. ఆన్లైన్లో కొనుగోళ్లతోపాటు డిజిటల్ మోడ్‌లో చెల్లింపులు చేసే వారికి రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.5876లకే ఒక గ్రామ్ బంగారం లభిస్తుంది.
దేశీయంగా బంగారం కొనుగోళ్లను తగ్గించడానికి 2015లో కేంద్రం ఈ సావరిన్ గోల్డ్ బాండ్ల స్కీమ్ తీసుకొచ్చింది. సబ్‌స్క్రిప్షన్‌కు మూడు రోజుల ముందు ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ 24 క్యారట్ల బంగారంపై నిర్ణయించిన ధర ఆధారంగా సావరిన్ గోల్డ్ బాండ్ స్కీంలో బంగారం ధర ఖరారు చేస్తారు.
ఒక తులం బంగారం ఒక యూనిట్ కింద కొనుగోలు చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) గరిష్టంగా నాలుగు కిలోల బంగారం, ట్రస్టులు 20 కిలోల వరకు కొనవచ్చు. భౌతికంగా బంగారం కొనుగోలుకు గల నిబంధనలే కేవైసీ నిబంధనలు వర్తిస్తాయి. ఈ బాండ్ల గడువు ఎనిమిదేండ్లు. గడువు ముగిసాక నాటి ధర చెల్లిస్తారు. అంతే కాదు. ఐదేండ్ల తర్వాత ఎప్పుడైనా వైదొలగవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

