Sony Xperia 5 V | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ సోనీ.. భారత్ మార్కెట్లోకి వచ్చేనెల ఒకటో తేదీన తన సోనీ ఎక్స్ పెరియా 5 వీ (Sony Xperia 5 V) ఆవిష్కరించనున్నది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తుందని సమాచారం. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సోనీ ఎక్స్ పెరియా 5 వీ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు రేర్ డ్యుయల్ కెమెరా సెటప్ వస్తుందని భావిస్తున్నారు.
గత మే నెలలో సోనీ తన ఎక్స్ పెరియా 1 వీ, ఎక్స్ పెరియా 10 వీ ఆవిష్కరించింది. ఎక్స్ పెరియా 1 వీ ఫోన్ ధర దాదాపు రూ.1,14,700 (1399 అమెరికా డాలర్లు) నుంచి ప్రారంభమైంది. గ్రీన్, బ్లాక్ కలర్స్ లో మార్కెట్లోకి ఎంటరైంది. యూరోపియన్ యూనియన్ మార్కెట్లో ఎక్స్ పెరియా 10 వీ సుమారు రూ.40,300 (449 యూరోలు) లకే లభించింది. ఈ ఫోన్ బ్లాక్, లావెండర్, సాగే గ్రీన్, వైట్ కలర్స్‌లో లభిస్తుంది.