Tips for 2 Wheeler Loan | తక్కువ వడ్డీకే టూ వీలర్ లోన్.. ఈ టిప్స్ పాటిస్తే సరి!
Tips for 2 Wheeler Loan | టూ వీలర్ రుణాలు కావాలంటే.. బ్యాంకుల వడ్డీరేట్లు, ప్రాసెసింగ్ ఫీజు, క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుని అప్లయ్ చేయాలి.
Tips for 2 Wheeler Loan | పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నా.. ఎక్కడికైనా అత్యవసరంగా గానీ.. రోజువారీగా ఆఫీసుకు వెళ్లాలన్నా.. గ్రామాల్లో రైతులు పంట పొలాలకు వెళ్లాలన్నా టూ వీలర్స్‌తో ఖర్చు తక్కువ.. భారతీయ కుటుంబాలు రవాణా అవసరాలకు టూ వీలర్స్‌ను ప్రిఫర్ చేస్తుంటారు. ఇక కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో కుటుంబ నిర్వహణ, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని దాదాపు ప్రతి ఒక్కరూ టూ వీలర్ కొనుగోలు కోసం రుణాలు తీసుకుంటారు. మీ ఫేవరెట్ వెహికల్ కొనుగోలుకు సకాలంలో రుణం లభించాలంటే క్రెడిట్ స్కోర్ బేష్షుగ్గా ఉండాలి. అయితే టూ వీలర్ రుణం కోసం మెరుగైన వడ్డీరేట్లు అందుబాటులో ఉన్నాయి. వాటితోపాటు కొన్ని టిప్స్ పాటిస్తే సరి.. అయితే అవేంటో ఓ లుక్కేద్దామా..!
మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండిలా
క్లీన్ క్రెడిట్ హిస్టరీ, గుడ్ క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి ఆకర్షణీయ వడ్డీరేటుకే టూ వీలర్ రుణం లభిస్తుంది. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందనుకుంటే, బ్యాంకులు అదనపు వడ్డీరేటు విధిస్తాయి. రెగ్యులర్ వడ్డీరేటు కంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ 750 పాయింట్లకు పైగా ఉంటే రిస్క్ ప్రీమియం లేకుండా సాధారణ వడ్డీరేటుకే టూ వీలర్ రుణం లభిస్తుంది. కనుక ఎల్లవేళలా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. పరిస్థితుల్లో తేడాలు ఉంటే.. క్రెడిట్ స్కోర్ మెరుగు పర్చుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలి.
వడ్డీరేట్లు ఇలా సరిపోల్చుకోవాలి
టూ వీలర్స్ రుణాలపై బ్యాంకుల వారీగా వడ్డీరేట్లు, చార్జీలు వేర్వేరుగా ఉంటాయి. కనుక మీరు అందుబాటులో ఉన్న వివిధ బ్యాంకుల టూ వీలర్ రుణాల తీరు తెన్నులను చెక్ చేసుకున్నాకే దరఖాస్తు చేసుకోవాలి. ప్రి-పేమెంట్ చార్జీలు, ప్రి-క్లోజర్ చార్జీలు, లేట్ పేమెంట్ ఫీజు, పెనాల్టీలతోపాటు ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చార్జీలు, వడ్డీరేట్ల ఆధారంగా ఆయా బ్యాంకులు ఇచ్చే రుణాలను సరిపోల్చుకోవాలి.
ద్విచక్ర వాహనాలకు వివిధ బ్యాంకుల రుణాలపై వడ్డీరేట్లు ఇలా
బ్యాంక్ ———————————————– వడ్డీరేటు
సెంట్రల్ బ్యాంక్ ———————————— 7.25 %
బ్యాంక్ ఆఫ్ ఇండియా —————————– 7.75%
జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్ ———————— 9.35%
కెనరా బ్యాంక్ ————————————— 9.40 %
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ————————– 9.55%
పంజాబ్ & సింధ్ బ్యాంక్ ————————– 9.70%
యాక్సిస్ బ్యాంక్ ———————————— 10.00%
యూనియన్ బ్యాంక్ ——————————– 10.80
టూ వీలర్స్ కంపెనీలతో బ్యాంకుల టై అప్
రుణంపై టూ వీలర్ తీసుకోవడానికి మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. మీ అంతట మీరు బ్యాంకర్‌ను ఎంచుకోవడం గానీ, టూ వీలర్ కంపెనీతో టైఅప్ ఉన్న బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీలో గానీ రుణం తీసుకోవచ్చు. సాధారణంగా బ్యాంకులు.. టూ వీలర్ కంపెనీలతో జత కడతాయి. అలా జత కట్టిన బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తాయి. అంతే కాదు తక్కువ వడ్డీకి రుణం పొందొచ్చు. అయితే టూ వీలర్ కంపెనీతో టైఅప్ అయిన బ్యాంకులు, ఇతర బ్యాంకులు-ఆర్ధిక సంస్థల వడ్డీరేట్లను సరిపోల్చుకుని రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి.
పండుగల వేళ స్పెషల్ ఆఫర్లు
పండుగల సీజన్ వచ్చినప్పుడల్లా బ్యాంకులు టూ వీలర్ కొనుగోలు దారులకు స్పెషల్ ఆఫర్లు అందుబాటులోకి తెస్తాయి. నూతన సంవత్సరం, స్వాతంత్య్ర దినోత్సవం, విజయ దశమి, దీపావళి, క్రిస్మస్, రంజాన్ తదితర పండుగల సందర్భంగా ఆకర్షణీయ వడ్డీరేట్లకే రుణాలొస్తాయి. ఇతర ఆఫర్లతోపాటు ప్రాసెసింగ్ ఫీజు కూడా బ్యాంకులు మాఫీ చేస్తుంటాయి. మంచి ట్రాన్సాక్షన్ రికార్డు కలిగి ఉంటే.. మీ బ్యాంక్ స్వయంగా ప్రీ అప్రూవ్డ్ టూ వీలర్ రుణం ఇస్తాయి. ఇటువంటి రుణాలు తీసుకునే సమయంలో రుణ మొత్తం, వడ్డీరేటు, చార్జీలు తదితర విషయాలు తెలుసుకోవాలి.
క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే ఇబ్బందులిలా
కొన్ని సార్లు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే రుణ గ్రహీతలు సమస్యలు ఎదుర్కొంటారు. బ్యాంకుల అర్హత ప్రమాణాలకు దూరంగా ఉంటారు. అటువంటప్పుడు ఎన్బీఎఫ్సీలను సంప్రదించొచ్చు. కానీ అధిక వడ్డీరేటుతోపాటు ప్రాసెసింగ్ చార్జీ వసూలు చేస్తాయి. కనుక టూ వీలర్ రుణం తీసుకునే సమయంలో మీ వాస్తవ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. రుణ వాయిదాల చెల్లింపులు డీఫాల్ట్ కాకుండా ముందుకు సాగితే మీ ఆర్థిక లావాదేవీలు హాయిగా సాగుతుంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

