Skoda Kushaq Onyx | భారత్ మార్కెట్లోకి స్కోడా కుషాక్ ఓన్యిక్స్.. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్.. రూ.12.39 లక్షలకు లభ్యం..!
Skoda Kushaq Onyx | దేశీయ మార్కెట్లోకి స్కోడా కుషాక్ ఓన్యిక్స్ మిడ్ సైజ్ ఎస్ యూవీ కారు తీసుకొచ్చింది. ఈ కారు రూ.12.39 లక్షలకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది.
Skoda Kushaq Onyx | ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా.. దేశీయ మార్కెట్లోకి మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో లిమిటెడ్ ఎడిషన్ కుషాక్ ఓన్యిక్స్ మోడల్ కారు ఆవిష్కరించింది. రేంజ్-టాపింగ్ స్టైల్ ట్రిమ్ లెవెల్, కాస్మొటిక్స్ అప్డేట్స్తో అందుబాటులోకి వచ్చింది. 1.0 లీటర్ల టీఎస్ఐ ఇంజిన్‌తో వస్తున్న ఓన్యిక్స్ కుషాక్ మోడల్‌కే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. దీని ధర రూ.12.39 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఓన్యిక్స్ కుషాక్ ఎడిషన్ కారులో క్రిస్టల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ విత్ డీఆర్ఎల్స్, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్ విత్ స్టాటిక్ కార్నరింగ్ ఫంక్షన్, రేర్ వైఫర్, డీ ఫాగర్, న్యూ వీల్ కవర్స్, ఓన్యిక్స్ బ్యాడ్జెస్తో వస్తున్నది.
ఈ కారులో ఇంటీరియర్‌గా పుష్-బటన్ స్టార్ట్/ స్టాప్, యాంబియెంట్ క్యాబిన్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే, స్కోడా 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ విత్ సబ్‌వూఫర్, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎలక్ట్రో-ఆపరేటెడ్ అండ్ ఆటో ఫోల్డింగ్ ఓఆర్వీఎం, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ లభిస్తాయి.
ఈ కారులో టీఎస్ఐ బేస్డ్ 1.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 114 బీహెచ్పీ పవర్, 178 ఎన్ఎం గరిష్ట టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్బ్యాక్స్తో ఇంజిన్ డిజైన్ చేశారు. భారత్ మార్కెట్లో అందుబాటులో ఉన్న సురక్షిత ఎస్యూవీ కార్లలో కుషాక్ ఓన్యిక్స్ ఒకటి.
సేఫ్టీ కోసం డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, రైన్ సెన్సింగ్ వైఫర్, ఐసోఫిక్స్ సీట్, ఆటోమేటిక్ హెడ్ లైట్, రేర్ పార్కింగ్ కెమెరా, మల్టీ కొల్లిషన్ బ్రేక్, ఏబీఎస్, ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి. హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, నిసాన్స్ కిక్స్ తోపాటు ఎంజీ మోటార్స్ హెక్టార్, టాటా మోటార్స్ హారియర్ వంటి కార్లతో స్కోడా కుసాక్ పోటీ పడుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

