Nirmala Sitharaman | డిపాజిట్ల సేకరణపై ఫోకస్ పెంచాలి : బ్యాంకర్లతో ఆర్ధిక మంత్రి
Nirmala Sitharaman : ప్రభుత్వ రంగ బ్యాంకులు డిపాజిట్ల సేకరణపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు, సామర్ధ్యంపై కేంద్ర మంత్రి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
Nirmala Sitharaman : ప్రభుత్వ రంగ బ్యాంకులు డిపాజిట్ల సేకరణపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు, సామర్ధ్యంపై కేంద్ర మంత్రి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డిపాజిట్ల సేకరణ, డిజిటల్ చెల్లింపులు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ వంటి పలు అంశాలపై బ్యాంకుల పురోగతిని పర్యవేక్షించారు.
2023-24లో బ్యాంకులు అన్ని విభాగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరచడంతో నికర నిరర్ధక ఆస్తులు 0.76 శాతానికి తగ్గాయని సమావేశంలో వెల్లడైంది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగైందని తేలింది. బ్యాంకుల సామర్ధ్యం మెరుగవడంతో మార్కెట్ల నుంచి బ్యాంకులు మూలధనాన్ని సమీకరించే సామర్ధ్యం కూడా పెరిగిందని గుర్తించారు. ఈ కాలంలో బ్యాంకులు ఏకంగా రూ. 27,830 కోట్ల డివిడెండ్‌ను వాటాదారులకు పంచాయి.
పరపతి వృద్ధికి అనుగుణంగా ఆ డిమాండ్‌ను అందుకునేందుకు డిపాజిట్ల సేకరణను పెంచాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడం ద్వారా డిపాజిట్స్‌ను రాబట్టాలని ఆమె బ్యాంకులకు సూచించారు. కస్టమర్లను బ్యాంకు ఉద్యోగులు నేరుగా కలిసి వారితో అనుబంధం పెంచుకోవడంతో పాటు డిపాజిట్లను పెంచేందుకు వినూత్న ఉత్పత్తులతో బ్యాంకులు ముందుకెళ్లాలని కోరారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

