Simple One electric scooter | మార్కెట్లోకి సింపుల్ ఎనర్జీ.. `సింపుల్ వన్ ఈ-స్కూటర్`.. దీని ధరెంతంటే..?!
Simple One electric scooter | ‘సింపుల్ ఎనర్జీ’ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్ మార్కెట్లోకి వచ్చేసింది. దీని ధర రూ.1.45 లక్షల నుంచి మొదలవుతుంది.
Simple One electric scooter |ఒకవైపు పెట్రోల్ ధర రూ.100 మార్క్‌పైనే కొనసాగుతున్నది. మరోవైపు చౌక ధరతోపాటు ఆల్టర్నేటివ్ మొబిలిటీ ఆప్షన్‌గా మార్కెట్లోకి వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలపై యూజర్లు క్రేజ్ పెంచుకుంటున్నారు. ఈ తరుణంలో సింపుల్ ఎనర్జీ ఆధ్వర్యంలోని `సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Simple ONE electric scooter)` మంగళ వారం మార్కెట్లోకి వచ్చేసింది. 2021 ఆగస్టులోనే ఈ స్కూటర్‌ను ఆవిష్కరించినా.. నాటి నుంచి అనునిత్యం కొత్త అప్డేట్లతో సింపుల్ ఎనర్జీ ఆసక్తిని రేకెత్తించింది. ఈ స్కూటర్ ధర రూ.1.45 లక్షల నుంచి మొదలవుతుంది.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నిర్వహణ
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. 7-అంగుళాల డిజిటల్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిజిటల్ డిస్ప్లేపై నేవీగేషన్, డాక్యుమెంట్ స్టోరేజీ, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్, ఓటీఏ అప్ డేట్స్, బ్యాటరీ అండ్ రేంజ్ వివరాలు కనిపిస్తాయి. ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 212 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. 5.54 గంటల్లో 80 శాతం చార్జింగ్ అవుతుంది. కేవలం 2.77 సెకన్లలో 40 కి.మీ.వేగాన్ని అందుకుంటుంది. ఫాస్ట్ చార్జర్ సాయంతో నిమిషం పాటు చార్జింగ్ చేస్తే 1.5 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. 8.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌తో ఈ స్కూటర్ పని చేస్తుంది. ఈ మోటార్ 72 ఎన్ఎం గరిష్ట టార్చి వెలువరిస్తుంది.
6 రంగుల్లో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్
మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. యూజర్లకు అందుబాటులో ఉంది. బ్రెజెన్ బ్లాక్, నమ్మా రెడ్, అజూర్ బ్లూ, గ్రేస్ వైట్, బ్రాజెన్ ఎక్స్, లైట్ ఎక్స్ రంగుల్లో లభిస్తుంది.
డ్యుయల్ బ్యాటరీ ఆప్షన్ స్పెషాలిటీ
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీకి అవసరమైన పరికరాల్లో 95 శాతం దేశీయంగా సమకూర్చుకున్నామని సింపుల్ ఎనర్జీ ఫౌండర్, సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ చెప్పారు. ఐపీ67 రేటింగ్‌తో కూడిన ఈ స్కూటర్ల్ 5 కిలోవాట్ల లిథియం అయాన్ డ్యుయల్ బ్యాటరీ ప్యాక్ అందిస్తున్నట్లు తెలిపారు. అత్యంత స్మార్ట్‌గా ఉండే ఈ స్కూటర్ సుదీర్ఘ దూరం ప్రయాణించగలుగుతుందని, డ్యుయల్ బ్యాటరీ దీని ప్రత్యేకత అని చెప్పారు.
రూ.1.45 లక్షల నుంచి ధర ప్రారంభం
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.45 లక్షల నుంచి మొదలవుతుంది. 750 వాట్ల పోర్టబుల్ చార్జర్ కోసం అదనంగా రూ.13 వేలు పే చేయాలి. వచ్చేనెల ఆరో తేదీ నుంచి స్కూటర్ల డెలివరీ ప్రారంభిస్తారు. తొలుత బెంగళూరు నుంచి ప్రారంభించి దశల వారీగా మిగతా నగరాల్లో డెలివరీలు చేస్తారు. ఇప్పటికే గత 18 నెలల్లో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం లక్షకు పైగా ప్రీ-బుకింగ్స్ నమోదయ్యాయి.
ఆ మూడు స్కూటర్లతో సై అంటే సై
సింపుల్ ఎనర్జీ ‘సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్’ భారత్ మార్కెట్లో ఎథేర్ 450, ఓలా ఎస్1, టీవీఎస్ ఐ-క్యూబ్ వంటి స్కూటర్లతో తల పడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో తమిళనాడులోని షూలాగిరిలో సింపుల్ విజన్ 1.0 అనే పేరుతో నూతన మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది సింపుల్ ఎనర్జీ. ఇది ఏటా దాదాపు ఐదు లక్షల స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

