Silver Price | మరింత వేగంగా వెండి పరుగులు.. రూ.4 లక్షలు దాటిన కిలో ధర
Silver Price | దేశీయంగా బంగారం (Gold), వెండి (Silver) ధరలు మరింత వేగంగా పరుగులు పెడుతున్నాయి. బంగారం ధర దాదాపు రూ.2 లక్షలకు చేరువ కాగా.. వెండి ధర ఫ్యూచర్స్ మార్కెట్లో ఏకంగా రూ.4 లక్షలు దాటి ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకుంది.
Silver Price : దేశీయంగా బంగారం (Gold), వెండి (Silver) ధరలు మరింత వేగంగా పరుగులు పెడుతున్నాయి. బంగారం ధర దాదాపు రూ.2 లక్షలకు చేరువ కాగా.. వెండి ధర ఫ్యూచర్స్ మార్కెట్లో ఏకంగా రూ.4 లక్షలు దాటి ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకుంది. హైదరాబాద్ (Hyderabad) లో ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,85,000 దాటింది. వెండి ధర (Silver Rate) రూ.4 లక్షల మార్కును దాటేసింది.
బుధవారం రాత్రి హైదరాబాద్ విపణిలో 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర రూ.1,73,300 గా ఉంది. కొన్ని గంటల్లోనే రూ.12 వేలు పెరిగింది. బుధవారం కిలో వెండి ధర రూ.3,79,700 వద్ద ముగియగా.. ఇవాళ ఏకంగా రూ.21 వేలకుపైగా పెరిగి రూ.4 లక్షల మార్కును దాటింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో మార్చి డెలివరీ కాంట్రాక్టుకు ఫ్యూచర్స్‌లో వెండి ధర గురువారం ఒక్కరోజే రూ.22,090 కి పెరిగి రూ.4,07,456 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఔన్స్ వెండి ధర తొలిసారి 5,600 డాలర్ల మార్క్ దాటింది. కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ఏప్రిల్ డెలివరీకి ఔన్సు ధర రూ.5,626.8 డాలర్లు పలికింది. ఔన్సు వెండి ధర రూ.119.51 డాలర్లకు చేరింది. అమెరికా డాలర్ విలువ బలహీనపడటం, వెండికి పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడంతో వైట్ గోల్డ్‌కు రెక్కలొచ్చాయని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడి సాధనంగా మదుపర్లు భావిస్తున్నారు. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణం అవుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

