Fixed Diposits | ఆ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లతో మేలు జరుగుతుందా? వాటికి సేఫ్టీ ఉంటుందా?!
Fixed Diposits | ఆర్బీఐ రెపోరేటుకు అనుగుణంగా అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసే విషయంలో ఆచితూచి స్పందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Fixed Diposits | పెరుగుతున్న ధరలను నియంత్రించడానికి ఆర్బీఐ రెపోరేట్ పెంచడంతో.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ రుణాలతోపాటు డిపాజిట్లపైనా వడ్డీరేట్లు పెంచేశాయి. ఇప్పుడు కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రధాన బ్యాంకులతో పోటీ పడుతూ వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నాయి. గరిష్టంగా 9.50 శాతం వరకు వడ్డీ ఇస్తామని ప్రకటిస్తున్నాయి. మరి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అధిక వడ్డీ కోసం ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో మదుపు చేయడం వల్ల మన మనీకి గ్యారంటీ ఉంటుందా.. రిటర్న్స్ మీద హామీ ఉంటుందా? అన్న సందేహాలు వస్తున్నాయి.
ప్రధాన ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకులతోపాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను కూడా ఆర్బీఐ నియంత్రిస్తుంది. పబ్లిక్ సెక్టార్ లేదా ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల మాదిరిగానే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను కూడా షెడ్యూల్డ్ బ్యాంకులని వర్గీకరించింది ఆర్బీఐ. అలాగని, కొంత రాబడి ఎక్కువ పొందడానికి మన డబ్బుపై భద్రత విషయంలో రాజీ పడొద్దని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. చాలా ఏండ్ల తరబడి కష్టపడితే వచ్చే ఆదాయాన్ని మీరు డిపాజిట్ చేస్తున్నారన్న సంగతి గమనంలోకి తీసుకోవాలి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నప్పుడు బ్యాంక్ ఆర్థిక పరిస్థితి, స్థిరత్వాన్ని అంచనా వేయాలి. మీ పెట్టుబడి సురక్షితం అని నిర్ధారణకు రావడానికి సదరు బ్యాంకు విశ్వసనీయత తదితర అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకోవాలి. పెట్టుబడి పెట్టడానికి ముందు రిస్క్ స్థాయి అంచనా కోసం ఆ బ్యాంకుకు గల క్రెడిట్ రేటింగ్‌ను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
అన్ని బ్యాంకుల మాదిరే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై రూ.5లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డిఐసీజీసీ) రూపంలో రక్షణ కవచం ఉంటుంది. ఈ బ్యాంకుల్లో మీరు డిపాజిట్ చేస్తున్నప్పుడు.. రిటర్న్స్‌తో అంటే వడ్డీతో కలిపి రూ.5 లక్షల్లోపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రూ.5 లక్షల్లోపు మాత్రమే డిపాజిట్ చేస్తే మీకు ఫైనాన్సియల్ సెక్యూరిటీ ఉన్నట్లు భావించాలి.
అధిక మొత్తంలో డిపాజిట్లు చేస్తున్నప్పుడు ప్రముఖ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను ఒకే గాటన కట్టొద్దని నిపుణులు చెబుతున్నారు. వడ్డీ ఆశతో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఎక్కువ మొత్తం డిపాజిట్ చేయకపోవడమే మంచిదని అంటున్నారు.
మీరు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు మధ్యలో విత్‌డ్రా చేసుకోవచ్చునా, లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందా? లేదా? అన్న సంగతి చూసుకోవాలి. మెచ్యూరిటీ తేదీకి ముందే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉపసంహరించుకుంటే పెనాల్టీ చార్జీలు వర్తిస్తాయన్న సంగతి పరిగణనలోకి తీసుకోవాలి. వడ్డీని ప్రధానంగా తీసుకునే ఫిక్స్డ్ డిపాజిట్లు చేయవద్దని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పెద్ద బ్యాంకుల్లోనే ఫిక్స్డ్ డిపాజిట్లు సేఫ్ అని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో కొద్ది మొత్తాలు మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

