షార్ట్-టర్మ్ ఆరోగ్య బీమా
షార్ట్-టర్మ్ ఆరోగ్య బీమా తాత్కాలిక కవరేజీని కల్పిస్తుంది. దీన్నే టర్మ్ మెడికల్ ఇన్సూరెన్స్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇది కొద్ది నెలల నుంచి ఏడాదిదాకే ఉంటుం ది. ఎవరైతే స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతో వచ్చే దీర్ఘకాలిక ఆరోగ్య బీమాలు కాకుండా తక్షణ కవరేజీలను కోరుకుంటారో వారినుద్దేశించినదే ఈ పాలసీ.
- లాభాలు, పరిమితులు తెలుసా?
షార్ట్-టర్మ్ ఆరోగ్య బీమా తాత్కాలిక కవరేజీని కల్పిస్తుంది. దీన్నే టర్మ్ మెడికల్ ఇన్సూరెన్స్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇది కొద్ది నెలల నుంచి ఏడాదిదాకే ఉంటుం ది. ఎవరైతే స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతో వచ్చే దీర్ఘకాలిక ఆరోగ్య బీమాలు కాకుండా తక్షణ కవరేజీలను కోరుకుంటారో వారినుద్దేశించినదే ఈ పాలసీ. సమగ్ర కవరేజీని కొనలేనివారికి కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. కంపెనీల్లో గ్రూప్ ఇన్సూరెన్స్ కోసం వేచిచూస్తున్న ఉద్యోగులు, నిరుద్యోగులకు దీని అవసరం ఎక్కువని చెప్పవచ్చు.
- షార్ట్-టర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్ శైలి
- కేవలం కొద్ది నెలల నుంచి ఏడాది వరకే బీమా కవరేజీ.
- లాంగ్-టర్మ్ ప్లాన్లతో పోల్చితే షార్ట్-టర్మ్ ప్లాన్లకు ప్రీమియంలు తక్కువే.
- ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు బీమా కవరేజీ ఉండకపోవచ్చు. కొన్ని రకాల చికిత్సలకూ వీలుండదు.
- కనీస ఆరోగ్య సమాచారంతో ఈ ప్లాన్లను తీసుకోవచ్చు.
- పరిమిత స్థాయిలోనే ఈ ప్లాన్ల చెల్లుబాటు ఉంటుంది. ఎంపిక చేసిన నెట్‌వర్క్‌లో తప్ప.. అన్ని దవాఖానల్లో చెల్లవు.
- లాంగ్-టర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను రెన్యువల్ చేసుకున్నట్టుగా ఈ షార్ట్-టర్మ్ పాలసీలను రెన్యువల్ చేసుకోలేం.
చివరగా..
షార్ట్-టర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్‌లు తక్షణ అవసరాలకే పనికొస్తాయి. కాబట్టి లాంగ్-టర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్లకే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. ప్రీమియంలు ఎక్కువైనప్పటికీ క్లెయిములు లేకపోతే కవరేజీలు పెరిగే ప్రయోజనం ఉంటుంది. మెటర్నిటీ, మెంటల్ హెల్త్ తదితర అవసరాలు, సమస్యలకూ స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్‌లే లాభదాయకం అని స్పష్టంగా చెప్పవచ్చు. అందుకే సమగ్ర ప్యాకేజీని తీసుకోవడం మరువద్దు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

