Air India | టాటాకు షాక్.. మహారాజ సీఈవో పోస్ట్‌కు ఇల్కర్ ఐకీ నో!
Air India | ఎయిరిండియా సీఈవో కం ఎండీ బాధ్యతలు చేపట్టేందుకు ఇల్కర్ ఐకీ నిరాకరించారు. ఈ సంగతి టాటా సన్స్ ధ్రువీకరించింది.
Air India | ఎయిరిండియా న్యూ ఓనర్లు టాటా సన్స్‌కు గట్టి షాక్ తగిలింది. మహారాజకు జవసత్వాలు కల్పించే లక్ష్యంతో చకచకా నిర్ణయాలు తీసుకుంటున్న టాటా సన్స్‌కు ఎదురుదెబ్బ తాకింది. ఎయిరిండియా న్యూ ఎండీ కం సీఈవోగా టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ చైర్మన్ ఇల్కర్ ఐకీ పేరును గత నెల 14న టాటా సన్స్ ఖరారు చేసింది. కానీ టాటా సన్స్ ఆధ్వర్యంలోని ఎయిరిండియాకు సీఈవో కం ఎండీగా పని చేసేందుకు నిరాకరిస్తున్నట్లు ఇల్కర్ ఐకీ మంగళవారం తెలిపారు. ఈ సంగతిని టాటా సన్స్‌కు కూడా ధృవీకరించింది.
కేంద్రం అభ్యంతరాలు ఇలా
ఎయిరిండియా సీఈవో కం ఎండీగా ఇల్కర్ ఐకీ నియామకంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలు బయటకు రావడంతో ఇల్కర్ ఐకీ నియామకంపై ఆందోళన వ్యక్తమైంది. దీంతో ఎయిరిండియా న్యూ ఎండీ కం సీఈవోగా మరో వ్యక్తిని నియమిస్తారని భావిస్తున్నారు.
భారత్ మీడియాపై ఐకి ఏమన్నారంటే..
ఎయిరిండియా ఎండీ కం సీఈవో పదవికి తన పేరు ప్రతిపాదనపై ఇల్కర్ ఐకీ రియాక్టయ్యారు. తన నియామకంపై భారత్ మీడియా పలు రకాల వార్తలు రాసిందన్నారు. భారత్‌లో ఒక సెక్షన్ మీడియా తనకు కొన్ని ఉద్దేశాలు ఆపాదించిందని పేర్కొన్నారు. ఒక వ్యాపారవేత్తగా నైపుణ్య వ్యూహం అమలు చేయడంతోపాటు తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం ముఖ్యం అని అన్నారు. ఇన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మహారాజ సీఈవోగా బాధ్యతల స్వీకరించడం తనకు గౌరవం కాదన్నారు. ప్రస్తుతం టాటా సన్స్‌కు ఎయిరిండియా, ఎయిర్ ఏషియా, విస్తారా ఎయిర్‌లైన్స్ ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

