ఎయిర్ కార్గోలోనూ జోష్
దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల్లో ఒకటిగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది.
- అభివృద్ధిపథంలో హైదరాబాద్ జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు
- ఏడాదికి 22 శాతం వృద్ధిరేటు
- భవిష్యత్తు మరింత ఆశాజనకం
- కీలకంగా ఫార్మా ఎగుమతులు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల్లో ఒకటిగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. కేవలం 2 గంటల వ్యవధిలో దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లే అవకాశం ఈ ఎయిర్పోర్టుకుంది. ప్రయాణీకుల విషయంలోనే కాదు సరకు రవాణాలోనూ గణనీయమైన వృద్ధిరేటును నమోదు చేస్తోంది. 2008లో ప్రారంభించిన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కార్గో కోసమే ప్రత్యేకంగా టర్మినల్ నిర్మాణం చేపట్టి దేశీయ, అంతర్జాతీయంగా సరకు రవాణా కోసం ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది.
దేశీయ సరకు రవాణాపరంగా ఏడాదికి 22 శాతం మేర వృద్ధిరేటు నమోదవుతోంది. భౌగోళికంగా దేశం మధ్యలో ఉండటం, మెరుగైన ఎయిర్ నెట్వర్క్, ఎయిర్ కార్గోపట్ల వినియోగదారుల ప్రాధాన్యాత, ఈ-కామర్స్‌కు ప్రజాదరణ కారణంగా దేశీయ రంగంలో వృద్ధి 35 శాతంగా ఉంటోంది. కోవిడ్ వల్ల ఎదురైన సవాళ్లను ధీటుగా ఎదుర్కొని జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్ఎసీ) 2021లో దేశీయ (డొమెస్టిక్) కార్గో ట్రాఫిక్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుంది. కోవిడ్ ముందు 2020 మొదట్లో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 55 దేశీయ గమ్యస్థానాలకు కనెక్టివిటీ ఉండగా, 2021 చివరినాటికి అది 65 గమ్యస్థానాలకు విస్తరించడంతో ప్రయాణికులు, సరకుల రవాణాపరంగా హైదరాబాద్ విమానాశ్రయానికి ఎంతో ప్రాధాన్యత పెరిగింది.
కార్గోలో 5వ స్థానం..
హైదరాబాద్ నుంచి జరిగిన కార్గో 2020తో పోలిస్తే 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2019లో దేశంలో అతిపెద్ద కార్గో హబ్‌గా ఉన్న హైదరాబాద్.. ఇటీవల పెరిగిన వృద్ధి కారణంగా 5వ స్థానానికి ఎగబాకింది. వ్యూహాత్మకంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు ఉన్న భౌగోళిక స్థానం, మెరుగైన డొమెస్టిక్ ఎయిర్ నెట్వర్క్, ఇతర రవాణా మార్గాలకన్నా ఎయిర్ కార్గోకు కస్టమర్లు ప్రాధాన్యత ఇవ్వడం, ఈ-కామర్స్‌కు ఆదరణ పెరగడం వంటి అనుకూల కారణాలతో హైదరాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ కార్గోలో 35 శాతంతో బలమైన వృద్ధిని నమోదు చేసింది. 2022లో దేశంలోని అన్ని ముఖ్యమైన ఈ కామర్స్ సప్లయి చైయిన్లతో హైదరాబాద్ నగరం కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి దేశం నలుమూలలా సరకు రవాణా చేసేందుకు వీలుగా ఉండటంతోపాటు ఈ-కామర్స్ సంస్థలు తమ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఏరోసిటీలో ఇప్పటికే ఏర్పాటు చేశాయి.
వేగంగా విస్తరణ
ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో క్లిష్టమైన షిప్మెంట్లను నిర్వహించగల సామర్థ్యం జీహెచ్ఎసీకి దక్కింది. నిరుడు దేశంలో అతిపెద్ద కోవిడ్ వ్యాక్సిన్ షిప్మెంట్లను సమర్థవంతంగా హ్యండిల్ చేసింది. ఈ ఏడాది డెడికేటెడ్ అంతర్జాతీయ కొరియర్ టెర్మినల్(ఐసీటీ)ని ప్రారంభించింది. మొత్తానికి దక్షిణ మధ్య భారతదేశంలో ఫార్మా ఎగుమతులకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారింది. ఇటీవల ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్‌ను టెంపరేచర్ కంట్రోల్డ్ ప్రదేశంగా మార్చి తద్వారా అలాంటి సదుపాయం కలిగిన దేశంలోని ఏకైక కార్గో టెర్మినల్‌గా అవతరించింది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు రేవంత్ రెడ్డి.. వీడియో
ప్రతి ఇంటికి ఇంకుడుగుంతను నిర్మించుకోవాలి : డీఎల్పీవో సుధీర్‌కుమార్
KTR | సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
గాంధీనగర్‌లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ
Alcohol | అల్లరి నరేశ్ ‘ఆల్కహాల్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

