US Jobs for Layoff Techies | లే-ఆఫ్‌లతో నో ప్రాబ్లం.. ప్రతిభకు అమెరికా కంపెనీల పట్టం.. 89 శాతం సంస్థల్లో మనోళ్లకే జాబ్!
US Jobs for Layoff Techies | మాంద్యం భయంతో టెక్ సంస్థలు భారీగా ఉద్వాసనలు పలికినా, భారతీయ నిపుణులకు అమెరికా కంపెనీలు రెడ్‌కార్పేట్ పరిచి నియమించుకుంటున్నాయి. ఈ ఏడాది 89 శాతం కంపెనీల్లో ఇండియన్ టెక్కీలకే ఉద్యోగాలు లభించాయి.
US Jobs for Layoff Techies | ఆర్థిక మాంద్యం ముప్పు నుంచి బయటపడేందుకు గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికినా, అమెరికా వంటి దేశాల్లో ప్రతిభావంతులైన భారతీయ నిపుణుల అవకాశాలకు కొదవ లేదు. అలా ఉద్వాసనకు గురైన వారిలో కాసింత నైపుణ్యం ఉన్నా ఇతర అమెరికా కంపెనీలు భారతీయ టెక్నాలజీ నిపుణులను కండ్లకు అద్దుకుని రిక్రూట్ చేసుకుంటున్నాయి. దాదాపు అమెరికాలోని కంపెనీలన్నీ విదేశీ నైపుణ్యానికి పెద్ద పీట వేస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన విదేశీ ప్రతిభావంతులను పిలిచి మరీ ఉద్యోగాలు ఇస్తున్నాయి. దేశంలోని 89 శాతం కంపెనీలు.. ఉద్వాసనకు గురైన విదేశీ నిపుణులను రిక్రూట్ చేసుకున్నాయని ఎన్వాయ్ గ్లోబల్ సర్వేలో తేలింది. అలా నియమించుకున్న వారి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడంలో ఆయా కంపెనీల హెచ్ఆర్ నిపుణులు బిజీబిజీగా గడుపుతున్నారని సర్వే నిగ్గు తేల్చింది.
గతేడాది ప్రారంభంతో పోలిస్తే, ఈ ఏడాది విదేశీ ప్రతిభావంతుల కోసం గిరాకీ ఎక్కువగా ఉంది. విదేశీ టెక్ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో ఆయా కంపెనీల హెచ్-1 బీ వీసా స్పాన్సర్‌షిప్‌లు ఆల్‌టైం రికార్డు నెలకొల్పాయని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 71 శాతం కంపెనీలు అత్యధిక విదేశీ నిపుణులను నియమించుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో హెచ్-1బీ వీసా దరఖాస్తుల సబ్మిషన్లో రికార్డు నెలకొల్పుతాయని అంచనా వేస్తున్నారు. 4.83 లక్షల హెచ్-1బీ వీసా దరఖాస్తులు రావచ్చు చెబుతున్నారు.
ఈ నెల ఒకటో తేదీ నుంచి హెచ్-1బీ వీసా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత లాటరీ ప్రక్రియ ద్వారా 83వేల మందిని కొత్తగా హెచ్-1బీ వీసా కింద ఎంపిక చేస్తారు. వీరిలో 60 శాతానికి పైగా భారతీయులే ఉంటారు. మరోవైపు, అమెరికాలో విదేశీ ప్రతిభావంతులకు భారీ గిరాకీ ఉన్నా, ఇమ్మిగ్రేషన్ అడ్డంకులతో పలు అగ్రశ్రేణి కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులను ఇతర ఆఫీసులకు తరలిస్తున్నారని తేలింది. ప్రత్యేకించి గతేడాది వీసా సమస్యలు తలెత్తడంతో 81 శాతం కంపెనీలు తమ ఉద్యోగులను మరో ఆఫీసుకు ట్రాన్స్ఫర్ చేస్తే, 80 శాతం కంపెనీలు ఇతర దేశాలకు తరలించాయి. కెనడా, మెక్సికో, బ్రిటన్‌ల్లోని ఆఫీసులకు వీరిని తరలిస్తున్నాయి.
ఆర్థిక మాంద్యం భయాలతో గతేడాది 78 శాతం కంపెనీలు కొత్త నియామకాలను నిలిపేయడంతోపాటు దాదాపు 51 శాతం విదేశీ వర్కర్లను సాగనంపాయని ఎన్వాయ్ గ్లోబల్ తెలిపింది. అమెరికాలోని టెక్ సంస్థల్లో హెచ్-1 బీ వీసాపై పని చేస్తూ.. కొలువులు కోల్పోయిన వారు 60 రోజుల్లోపు మరో ఉద్యోగం సంపాదించుకోవాలి. లేని పక్షంలో వారు స్వదేశానికి వెళ్లిపోవాలి. హెచ్-1బీ వీసాదారుల్లో అత్యధికులు భారతీయ టెక్కీలే. వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయి.. భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకుంటున్న వేళ.. అమెరికాలోని పలు కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించడం భారతీయ టెక్ నిపుణులకు ఊరటనిచ్చే అంశమే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

