సూచీలకు ఇంధన సెగ.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లకు ఇంధన సెగ గట్టిగానే తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఒక్కసారిగా భారీగా పుంజుకోవడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను తరలించుకుపోవడం మదుపర్లలో టెన్షన్ పెంచింది.
ముంబై, అక్టోబర్ 12 : దేశీయ స్టాక్ మార్కెట్లకు ఇంధన సెగ గట్టిగానే తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఒక్కసారిగా భారీగా పుంజుకోవడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను తరలించుకుపోవడం మదుపర్లలో టెన్షన్ పెంచింది. ఫలితంగా లాభాల్లో ప్రారంభమైన సూచీలకు మధ్యాహ్నం తర్వాత గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాల వైపు నడిపించాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగ షేర్లలో భారీగా క్రయవిక్రయాలు జరగడం సూచీల పతనాన్ని రెట్టింపు చేశాయి. ఇంట్రాడేలో 800 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 72 వేల కీలక మైలురాయిని కోల్పోయింది.
చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 547.65 పాయింట్లు కోల్పోయి 71,924.68 వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 157.10 పాయింట్లు పతనం చెంది 22,363.35 పాయింట్ల వద్దకు జారుకున్నది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.14 శాతం ఎగబాకి 105.8 డాలర్లకు చేరుకోవడం మదుపర్లను ఆందోళనకు గురిచేసిందని, దీంతో అమ్మకాల బటన్ నొక్కడం పతనానికి ఆజ్యంపోశాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. రోజువారీ సీఆర్ఆర్ మెయింటెనెన్స్‌ను పెంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం బ్యాంకింగ్ రంగ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు.
- దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు 3.23 శాతం పతనం చెంది టాప్ లూజర్‌గా నిలిచింది.
- టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, హెచ్‌యూఎల్, ఎల్అండ్టీ, మ్యాక్స్ హెల్త్, టీసీఎస్, హిందా ల్కో, ఎయిర్టెల్, కోల్ ఇండియా, శ్రీరామ్‌ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెం ట్, ఇండిగో, గ్రాసిమ్, రిలయన్స్, నెస్లె, జియో ఫైనాన్స్ షేర్లు కూడా పతనం చెందాయి.
- కానీ, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, హెచ్ఏఎల్ షేర్లు రెండు శాతానికి పైగా బలపడ్డాయి.
- టీఎంపీవీ, టీవీఎస్ మోటర్, ఐచర్ మోటర్, మహీం ద్రా, ఎస్బీఐ లైఫ్, సిప్లా, బీఈఎల్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

