కదంతొక్కిన సూచీలు
- భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు
ముంబై, జూలై 6: స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, వాహన రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో దేశీయ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు పడిపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడంతో ప్రారంభం నుంచి లాభాల బాటపట్టాయి. ఇదే ట్రెండ్‌ను చివరి వరకు కనపర్చాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చాలా రోజుల తర్వాత 616.62 పాయింట్లు లేదా 1.16 శాతం లాభపడి 53,750.97 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 684 పాయింట్లు లాభపడిన సూచీ చివర్లో ఇంతటి లాభాలను నిలుపుకోలేకపోయింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 178.95 పాయింట్లు(1.13 శాతం) అందుకొని 15,989.80 పాయింట్ల వద్ద ముగిసింది.
- బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, మారుతి సుజుకీ, కొటక్ మహీంద్రా బ్యాంక్‌ల షేర్లు లాభపడ్డాయి.
- కానీ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి.
- 30 షేర్ల ఇండెక్స్ సూచీల్లో 25 షేర్లు లాభాల్లో ముగియడం విశేషం.
- క్రూడాయిల్ 100 డాలర్ల దిగువకు పడిపోవడం, ఎఫ్ఐఐలు కొనుగోళ్ళు జరపడంతో సూచీలు కదంతొక్కాయి.
- రంగాలవారీగా చూస్తే ఆటో 2.73 శాతం, ఎఫ్ఎంసీజీ 2.45 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 2.42 శాతం, రియల్టీ 2.39 శాతం వరకు లాభపడ్డాయి. కానీ, ఎనర్జీ, మెటల్ రంగ షేర్లు నష్టపోయాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

