సెన్సెక్స్ @ 59,000

- మరో 418 పాయింట్లు పెరిగిన సూచీ
- బ్యాంకింగ్ షేర్లలో భారీ కొనుగోళ్లు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: బ్యాంకింగ్ షేర్లు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో జోరుగా కొనుగోళ్లుసాగడంతో గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 59,000 పాయింట్లస్థాయిని దాటేసింది. ఈ సూచీ 418 పాయింట్లు పెరిగి 59,141 పాయింట్ల చరిత్రాత్మక గరిష్ఠస్థాయి వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 110 పాయింట్లు పెరిగి 17,629 పాయింట్ల రికార్డుస్థాయి వద్ద నిలిచింది. టెలికాం, ఆటో తదితర రంగాల్లో ప్రభుత్వం ప్రకటించిన విధాన చర్యలు ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా టెలికం రంగానికి ప్రకటించిన ప్యాకేజీతో ఆయా కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకులకు ఊరటనివ్వడం, బ్యాడ్‌బ్యాంక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో ఈ షేర్లలో కొనుగోళ్లు జరిగినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 4 శాతంపైగా పెరిగి రూ.465 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. మిడ్‌క్యాప్ పీఎస్‌యూ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5 శాతం వరకూ పెరిగాయి. ప్రైవేటు రంగ బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంక్ సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా 7.2 శాతం ఎగిసింది. కొటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు కూడా లాభపడ్డాయి. ఇతర రంగాల షేర్లలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసి షేరు 5 శాతం ర్యాలీ జరిపి కొత్త గరిష్ఠస్థాయి వద్ద ముగిసింది. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ బ్యాంకెక్స్ సూచీ 2.12 శాతం పెరగ్గా, ఎనర్జీ, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు లాభపడ్డాయి.
టెలికం షేర్లకు బూస్ట్..
టెలికం రంగానికి ప్రకటించిన ప్యాకేజీతో భారతి ఎయిర్టెల్ ఇంట్రాడేలో రూ.744 ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకింది. లాభాల స్వీకరణతో చివరకు స్వల్ప నష్టంతో ముగిసింది. దివాలా ప్రమాదం నుంచి తప్పించుకున్న వొడాఫోన్ ఐడియా షేరు 28 శాతం ర్యాలీ జరిపి రూ.11.45 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 శాతం పెరిగింది.
ఫ్రాన్స్‌ను దాటిన ఇండియా
సెన్సెక్స్ 59,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించడంతో బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ. 2,60,78,355 కోట్ల రికార్డుస్థాయికి చేరింది. వరుసగా మూడురోజులు జరిగిన మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.46 లక్షల కోట్లు పెరిగింది. డాలర్ల రూపేణా బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల విలువ 3.4055 ట్రిలియన్ డాలర్లు. దీంతో ఇండియా మార్కెట్ విలువ.. ఫ్రాన్స్ మార్కెట్ విలువను మించింది. అలాగే ప్రపంచంలో అత్యంత విలువైన మార్కెట్లలో ఆరోస్థానాన్ని ఇండియా ఆక్రమించింది. ఫ్రాన్స్ మార్కెట్ విలువ 3.4023 ట్రిలియన్ డాలర్లు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

