SEBI – NSE | ఎన్ఎస్ఈ కో లొకేషన్ కేసు.. మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణకు సెబీ రిలీఫ్..!
SEBI - NSE | కో-లొకేషన్ కేసులో సరైన ఆధారాలు లభించక పోవడంతో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ ఉద్యోగులు చిత్రా రామకృష్ణ, రవి నరైన్ సహా ఏడుగురిపై ఆరోపణలను సెబీ కొట్టి పారేసింది.
SEBI – NSE | కో-లొకేషన్ కేసులో సరైన ఆధారాలు లభించక పోవడంతో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ ఉద్యోగులు చిత్రా రామకృష్ణ, రవి నరైన్ సహా ఏడుగురిపై ఆరోపణలను సెబీ కొట్టి పారేసింది. వారు రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించారని వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేనందున కేసును తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. చిత్రా రామకృష్ణతోపాటు రవి నరైన్ సహా ఏడుగురు ఎన్ఎస్ఈ మాజీ ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు, రికార్డులు అందజేయడంలో విఫలమైనందున ఈ అభియోగాలను తోసిపుచ్చుతున్నట్లు సెబీ తన 83 పేజీల ఆదేశాల్లో పేర్కొంది. ఆనంద్ సుబ్రమణ్యన్, రవీంద్ర ఆప్టే, ఉమేష్ జైన్, మహేశ్ సోపార్కర్, దేవి ప్రసాద్ సింగ్ తదితరులపై ఆరోపణలనూ కొట్టేసినట్లు సెబీ తెలిపింది.
ఎన్ఎస్ఈ సీఈఓగా పని చేసినప్పుడు చిత్రా రామకృష్ణ.. స్టాక్ బ్రోకర్లకు కో-లొకేషన్ కేసులో అక్రమంగా లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు ఉన్నాయి. రెండున్నర దశాబ్దాల పాటు ఎన్ఎస్ఈలో సేవలందించిన చిత్రా రామకృష్ణ 2016 డిసెంబర్ లోనే వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేసినా.. బోర్డు సభ్యులతో విభేదాలే కారణం అని బయట పడింది. తర్వాత చిత్రా రామకృష్ణపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆమెపై సెబీ చర్యలు చేపట్టింది. ఆమె విదేశాలకు వెళ్లకుండా అప్పట్లో సీబీఐ లుకౌట్ నోటీసు కూడా జారీ చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

